విజయనగరం

‘ఉపాధి’తో చేపల చెరువుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 28: ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని 150 చేపల చెరువులను గుర్తించి అభివృద్ధి పరుస్తామని జిల్లా కలెక్టర్ ఎం ఎం నాయక్ అన్నారు. గురువారం కలెక్టర్ చేపల పెంపకం, అభివృద్ధి అంశాలపై అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది 42 చెరువులు మంజూరు చేయగా 18 పూర్తయ్యాయని, మిగిలిన చేపల చెరువులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది మంజూరు చేసిన 150 చెరువులకు మంజూరు ఉత్తర్వులు సత్వరం తీసుకుని పనులు ప్రారంభించాలని ఆదేశించారు. చేపల అభివృద్ధి అధికారులు, ఉపాధిహామీ పథకం ఎపిఓలతో చర్చించి గురించిన చెరువుల వివరాలను ఆన్‌లైన్‌లో తెలియజేయాలని చెప్పారు. ఈ చెరువులలో క్యాపటీవ్ నర్సరీలు, చిన్న, పెద్ద చేపపిల్లలు పెంచి పెద్ద చెరువులలో విడిచిపెట్టాలని ఆదేశించారు. మత్స్యకార గ్రామాలకు రహదారులను ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టాలని చేపలను ఎండబెట్టేందుకు ఫ్లాట్‌ఫారాలు, రిజర్వాయర్లలో వలలు దాచుకోవడానికి మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మత్స్యశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఫణి ప్రకాష్ పాల్గొన్నారు.