విజయనగరం

బ్యాంకుల్లో నగదు ఇబ్బందులు ఎప్పుడు తీరేనో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామభద్రపురం, మార్చి 17: బ్యాంకుల్లో నగదు కొరత ఖాతాదారులను ఇప్పటికీ వేధిస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దనోట్లు రద్దయితే 2 సంవత్సరాలు కావస్తున్న ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుందని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంకులో ఇప్పటికీ ఖాతాదారులకు సరిపడు నగదు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. తమ ఖాతాలలో ఉన్న నగదును తీసుకోవడంలో కూడా ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు అని ఖాతాదారులు బ్యాంకు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతుందని బ్యాంకుల అధికారులు అంటున్నారు. ఇప్పటికీ రోజుకు 20వేల రూపాయలకు మించి నగదు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అలాగే ఏటీఎం లలో కూడా నగదు ఉంచకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతున్నారు.

కోట దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీం జడ్జి
పార్వతీపురం, మార్చి 17: పార్వతీపురంలోని బెలగాంలో గల శ్రీశ్రీశ్రీ కోట దుర్గాదేవి అమ్మవారి ఆలయాన్ని శనివారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దుర్గాదేవి అమ్మవారిని ఉమ్మడి రాష్ట్ర హెకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టుల వ్యవహారాల ఇన్‌ఛార్జి అయిన జస్టిస్ టి.రజనితో పాటు ఉమ్మరి రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ తదతరులు దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.

రిజిస్ట్రార్ జనరల్ ఇంటిని సుప్రీం జడ్జి సందర్శన
పార్వతీపురం, మార్చి 17: ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ చీకటి మానవేంద్రరావుకు చెందిన పార్వతీపురంలోని ఆయన స్వగృహాన్ని శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ సందర్శించారు. పార్వతీపురంలోని నూతన కోర్టు భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా పార్వతీపురం విచ్ఛేసిన సుప్రీం జడ్జికి రిజిస్ట్రార్ జనరల్ తన ఇంటికి స్వాగతం పలికారు. దీంతో సుప్రీం జడ్జి జస్టిస్ ఎన్ వి రమణతో పాటు ఉమ్మడి హైకోర్టు జడ్జి, విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జి జస్టిస్ టి రజని కూడా సందర్శించి కొంతసేపు మానేంద్రనాథ్ రాయ్ ఇంటిలో గడిపారు. ఈసందర్భంగా మానవేంద్రరాయ్ తన కుటుంబ సభ్యులను సుప్రీం, హెకోర్టు జడ్జిలకు పరిచయం చేశారు. తన కుటుంబీలలో తన సోదరుడు చీకటి వివేకానంద్‌తో పాటు తన కుటుంబీకులందరినీ పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురంలోని తన మిత్రులు, అభిమానులను సైతం సుప్రీం జడ్జికి పరిచయం చేశారు. ఈసందర్భంగా చీకటి కుటుంబీకులు సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను సన్మానించారు.