విజయనగరం

రూ. 412కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, ఏప్రిల్ 28: జిల్లాలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు 412కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించనున్నామని డిఆర్‌డిఎ సహాయ పథక సంచాలకులు బి సుధాకరరావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక వెలుగు కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ డి ఆర్‌డి ఎ పరిధిలోని 26 మండలాలకు ఈ రుణాలు అందించామని చెప్పారు. ఐటిడి ఎ పరిధిలోని ఎనిమిది మండలాలకు 60 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందజేసామని అన్నారు. స్ర్తినిధి పథకం కింద 28కోట్లు, ఐటిడి ఎ పరిధిలోని ఎనిమిది మండలాలకు రెండు కోట్లురుణాలు అందించామని చెప్పారు. ఈ రుణాలు ద్వారా మహిళా సంఘాల జీవనోపాధి పెంపొందించుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. అదేవిధంగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ, స్ర్తినిధి రుణాలకు ప్రణాళికలు తయారుచేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా మహిళలకోసం నియోజకవర్గం పరిధిలో కుట్టు శిక్షణ కేంద్రాల ద్వారా జీవనోపాధి మెరుగుపరుస్తామని అన్నారు. ఎస్‌బిఐ సహకారంలో మహిళలకు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. నెల్లిమర్ల మండలంలో 19కోట్లు బ్యాంకు లింకేజీ, 1.40 కోట్లు స్ర్తినిధి రుణాలు 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఇవ్వనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎపి ఎం జగదీష్‌కుమార్ పాల్గొన్నారు.