విజయనగరం

పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 28: పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్థానిక బహుళార్థక పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంవిఎ నర్సింహులు అన్నారు. ప్రపంచ పశువైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానికంగా అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నర్సింహులు మాట్లాడుతూ వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది పాడిపరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గోపాలమిత్ర జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ వైవి రమణ మాట్లాడుతూ పాడిపరిశ్రమను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. సబ్సిడీపై పశువులకు మేత అందిస్తుందని తెలిపారు. జిల్లాలో పాల ఉత్పతి పెరుగుతుందని, గతంతో పోల్చుకుంటే గ్రామాలలో పాడిపరిశ్రమపై ఎక్కువమంది రైతులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. మేలుజాతి పశువుల పెంపకం చేపట్టి ఆదాయం పెంచుకునేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎలయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ నర్సింహాలును, డాక్టర్ రమణ, జొన్నవలస పశువైద్యాధికారి డాక్టర్ ఆర్.శారదను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ ధర్మారావు, ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ గాడి ప్రసాద్, ఎలయన్స్‌క్లబ్ రీజనల్ చైర్మన్ గురుప్రసాద్, భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.