విజయనగరం

ప్రత్యేక హోదా ఉద్యమవేడి కేంద్రానికి తాకాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మార్చి 22: ప్రత్యేక హోదా ఉద్యమవేడి కేంద్రానికి తాకేలా ఉండాలని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎపి మేధావుల పోరం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ప్రత్యేక హోదాకోసం నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న డాక్టర్ తాడ్డిజశ్వంత్ నాయుడుకు సంఘీభావం తెలుపుతూ చలసాని ప్రసంగించారు. ప్రధాని మోడీ దేశానికి ప్రధానిమంత్రిగా కాకుండా గుజరాత్ ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఆంధ్రా ఒక్క్భాగమని విస్మరించి, దుర్మార్గంగా వ్యవహరించి నమ్మకద్రోహం, నయవంచన చేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. టిడిపి ప్రభుత్వం గతంలో ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి వదిలివేశారని అన్నారు. ఇప్పటికైనా టిడిపి కళ్లు తెరచి బయటకు వచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్ష కమిటీ వేయాలని సూచించారు. విద్యార్థులు చదువుతూ ఉద్యమంలో భాగస్వామ్యం కావచ్చు అని అన్నారు. తొలి అంకంలో రాష్ట్రంలో జాతీయ రహదారి దిగ్భంధం చేస్తుండగా రెండో అంకంలో రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో రహదారి దిగ్భంధం చేసి ఇతర రాష్ట్ర వాహనాలు రాకుండా చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రధాని మోడీకి రాష్ట్రంపై విశ్వాసం లేకపోతే మనకు పార్లమెంటుపై ఎందుకు విశ్వాసం ఉండాలని ప్రశ్నించారు. కేంద్రానికి పన్నులు చెల్లించకుండా చేయడానికి వెనుకాడేదిలేదని హెచ్చరించారు. ఇదే సమయంలో కులాలు, మతాలు, జిల్లాల మధ్య కొన్ని శక్తులు చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండి ఉద్యమించాలని అన్నారు. ఎంపి అశోక్‌గజపతిరాజు మంచి వ్యక్తి అయినప్పటికీ పార్లమెంటులో నోరు మెదకపోవడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అందరు దేశ భక్తితో గల పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా డాక్టర్ జశ్వంత్‌నాయుడు ఉద్యమాలు చేయడం అభినందనీయమని చెప్పారు. అలాగే సిపిఎం డివిజన్ కార్యదర్శి పురం అప్పారావు రజక వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు మరిచర్ల దుర్గారావు, సర్పంచ్ మండల సురేష్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కూరెళ్ల నాగభూషణరావుతోపాటు న్యాయవాదులు డాక్టర్ జశ్వంత్‌నాయుడుకు సంఘీభావం తెలిపారు.