విజయనగరం

ముమ్మరంగా ఆస్తిపన్ను వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), మార్చి 23: పట్టణంలో ఆస్తిపన్ను వసూళ్లు జోరుగా జరుగుతోంది. పన్నుల వసూళ్లకోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందాలు పన్నుల వసూళ్లలో నిమగ్నమై ఉన్నాయి. ఇంతవరకు 17 కోట్ల రూపాయల మేరకు పన్నులు వసూలు చేశారు. గత ఏడాది ఇదే సమయానికి 15 కోట్ల రూపాయలు వసూలు చేయగా ఈ ఏడాది రెండుకోట్ల రూపాయల మేరకు అదనంగా వసూలు చేశారు. మున్సిపాలిటీలో రెవెన్యూ విభాగం ఉద్యోగులతోపాటు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను కూడా పన్నుల వసూళ్ల కోసం నియమించారు. దీంతో పన్నుల వసూళ్లశాతం పెరిగింది. ముఖ్యంగా మొండిబకాయిదారులపై ప్రత్యేకంగా దృష్టి సారించిన మున్సిపల్ ఉద్యోగులు పన్నులను చెల్లించని బకాయిదారుల ఆస్తులను జప్తు చేస్తున్నారు. అలాగే షాపులకు తాళాలు వేస్తున్నారు. మొండిబకాయిదారుల ఇళ్లకు మున్సిపల్ కమిషనర్ కనకమహాలక్ష్మి స్వయంగా బకాయిలను చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. మొండిబకాయిదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో పన్నుల వసూలు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా విలేఖరులతో కనకమహాలక్ష్మి మాట్లాడుతూ పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 25,26 తేదీల్లో ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సిందేనని, విధులకు హాజరు కాకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు కిరణ్, సాయిప్రసాద్, చిన్నంనాయుడుతోపాటు అప్పలరాజు, వినోద్ తదితరులు పన్నుల వసూళ్లలో చురుకుగా పాల్గొంటున్నారు.