విజయనగరం

తూర్పుకాపులపై ప్రభుత్వానికి చిన్నచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 28: తూర్పుకాపుల సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని పట్టణ తూర్పు కాపు సంఘ అధ్యక్షుడు గొర్లె వెంకటరమణ ఆరోపించారు. గురువారం సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి రుణాలు ప్రకటించిందని సంతోషించాలో లేక కాపుకార్పొరేషన్ కేవలం ఆర్థికంగా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకే రుణాలు పరిమితం చేయడం చూసి ఆవేదన పడాలో అర్థంకాని పరిస్థితి ఉందని అన్నారు. వెనుకబడిన కులాలకు చెందిన తూర్పు కాపులు జిల్లాలో ఆరు లక్షల మంది ఉన్నారని, నలుగురు ఎమ్మెల్యేలు జిల్లాలో ఉన్నా తూర్పుకాపుల సమస్యలను ప్రస్తావించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ సమావేశంలో సంఘనాయకులు మజ్జి అప్పారావు, నాగభూషణం పాల్గొన్నారు.