విజయనగరం

చోరీ సొత్తు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 28: జిల్లాలోని ఎస్.కోట, లక్కవరపుకోట, పెదమానాపురం పోలీసు స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడిన నేరాలకు సంబంధించి సొత్తును సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. సిసిఎస్ డిఎస్పీ చక్రవర్తి ఆదేశాలతో సి ఐ నర్సింహమూర్తి, సిబ్బంది ఎస్.కోట ఎస్సై రవికుమార్ సిబ్బంది సంయుక్తంగా నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం పట్టణం గాజులరేగకు చెందిన వెంపడాపుశ్రీను ఎస్.కోట, ఎల్.కోట, పెదమానాపురం పోలీసుస్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడి వెండి,బంగారు వస్తువులు చోరీ చేసాడని సిసి ఎస్ సి ఐ నర్సింహమూర్తి గురువారం తెలిపారు. నిందితుడి నుండి 80వేల రూపాయల విలువగలిగిన ఆభరణాలు, 2,300రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.