విజయనగరం

అక్రమ ఇసుక నిల్వలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 28: జిల్లాలోని భోగాపురం మండల కేంద్ర సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని చంపావతి నదీ పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుకను కొందరు వ్యక్తులు తవ్వి జాతీయ రహదారి సమీపంలోని ప్రాంతాలలో నిల్వ చేస్తున్నారు. ఈ ఇసుకను సమీపంలోని విశాఖ నగరానికి తరలించి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా భోగాపురం మండల కేంద్రం పరిధిలో సుమారు 150 ట్రాక్టర్ల ఇసుక లోడు అక్రమంగా నిల్వ చేసారు. సమాచారం తెలుసుకుని భోగాపురం సి ఐ వైకుంఠరావు సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకుని ఇసుకను గుర్తించారు. అక్రమంగా తవ్వించేందుకు సిద్ధంచేసిన ఇసుకను స్వాధీనం చేసుకుని మండల తహశీల్దార్ లక్ష్మారెడ్డికి అప్పగించారు.

ఉపాధి కూలీలకు వేసవి భత్యం
విజయనగరం(టౌన్), ఏప్రిల్ 28: ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధిహామీ వేతన దారులు దినసరి వేతనం చాలా వరకు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేతనదారులకు వేసవి భృతిని కల్పించాలని నిర్ణయించింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నైపుణ్యంలేని పనులకు హాజరైన వేతనదారులు బ్యాచ్ నెం.1లో గ్రామ పంచాయితీలలో ఏప్రిల్ 25 నుండి 28 వరకు బ్యాచ్ నెం.2లో పంచాయితీలలో ఏప్రిల్ 28 నుండి మే 1వ తేదీ వరకు వేసవి భత్యం కూలీలు సంపాదించిన రోజువారీ సగటు వేతనంలో 50శాతం అదనంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో 2 25 370 మంది వేతనదారులకు లబ్దిచేకూరనుంది.