విజయనగరం

పిహెచ్‌సిల్లో నెలకు 30 డెలివరీల లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఏప్రిల్ 28: ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నెలకు 30 డెలివరీల చేయాలన్న లక్ష్యమని సిహెచ్‌ఎన్‌సి డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఓ ఎం చామంతి ఆదేశించారు. గురువారం స్థానిక సిహెచ్ ఎన్‌సిలో ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సీనియర్ అసిస్టెంట్లుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పిహెచ్‌సిలో 30 డెలివరీలు కావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని స్పష్టం చేసారు. ఎన్టీఆర్ వైద్యసేవలు ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా చర్యలుతీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఐదు రకాల వైద్య సేవలు అమలు పర్చాలని చెప్పారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని, అవసరమైతే ప్రత్యేక సమావేశాలు జరపాలని సూచించారు. అదేవిధంగా బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా చేసుకోవాలని అన్నారు. సిగ్నల్ రానిచోట వారు పక్క ప్రదేశానికి వెళ్లి బయోమెట్రిక్ హాజరు చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో హెల్త్ ఎడ్యుకేటర్ డి వి గిరిబాబు, మలేరియ సబ్ యూనిట్ అధికారి గణేష్, సిహెచ్ ఓ లక్ష్మణరావు, డిపిఎం లుకాబాయి, వైద్యాధికారులు, సీనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.