విజయనగరం

అర్హులందరికీ ఎన్టీఆర్ గృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరకముడిదాం, ఏప్రిల్ 28: రాష్ట్రంలో సొంత ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సామూహిక ఎన్‌టిఆర్ గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. గురువారం మండలంలో గల సాతాంవలస, గరుగుబిల్లిలో ఎన్‌టిఆర్ రెండు పడకల గృహ నిర్మాణాలకు ఆమె శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ఇందులో భాగంగానే ఎన్‌టిఆర్ సామూహిక ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతి పేదవాని ఇంటికి 2.9 లక్షలతో రెండు పడకల గదులు ఇల్లు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అలాగే ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తాడ్డి సన్యాసినాయుడు, జడ్‌పిటిసి పెందుర్తి సింహాచళం, ఎంపిడిఒ సూర్యం, పలువురు అధికారులు, తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.