విజయనగరం

రెండు రోజులకోసారి నీటి సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు) ఏప్రిల్ 28: పట్టణంలో రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేసేందుకు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. పట్టణంలో కొత్తపేట నీళ్లట్యాంకు పరిధిలో ఉన్న 16 వార్డులలో మూడురోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. అయితే కంటోనె్మంట్ వాటర్ ట్యాంకు నుంచి కొత్తఅగ్రహారం వాటర్‌ట్యాంకు మీదుగా కొత్తపేట నీళ్లట్యాంకుకు 27 లక్షల రూపాయల ఇంటర్ కనెక్షన్ పైపులైన్ ఏర్పాటు చేశామని అన్నారు. గురువారం తన ఛాంబర్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇంటర్ కనెక్షన్ పైపులైన్ ఏర్పాటు చేయడం ద్వారా కొత్తపేట నీళ్లట్యాంకు పరిధిలో ఉన్న ప్రాంతాలకు మంచినీటి కొరత తీరినట్లయిందని తెలిపారు. చంపావతి నది ఎండిపోవడం వల్ల నెల్లిమర్ల, రామతీర్థం వాటర్‌వర్క్స్ పరిధిలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయని, ఫలితంగా ఈ వాటర్‌వర్క్స్ నుంచి మంచినీటి సరఫరా తగ్గిపోయిందని అన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మంచినీటి సరఫరాను మెరుగుపర్చేందుకు కొత్తఅగ్రహరం వాటర్ ట్యాంకు నుంచి కొత్తపేట నీళ్లట్యాంకుకు ఇంటర్ కనెక్షన్ పైపులైన్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఇక నుంచి రోజు రోజు విడిచి మంచినీటిని సరఫరా చేస్తామని అన్నారు. వేసవి దృష్ట్యా మంచినీటి ఎద్దడిని నివారించేందుకు పది ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చిందేందుకు 30 చలివేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.