విజయనగరం

ఆల్ ది బెస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 28: జిల్లాలో ఎంసెట్ 2016 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసారు. ఎంసెట్ పరీక్ష శుక్రవారం జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు ఏడు కేంద్రాలు విద్యార్థులకు ఏర్పాటు చేసారు. 6,502మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. జె ఎన్‌టియు విజయనగరం క్యాంపస్, సీతంకాలేజీ, భోగాపురం మండలం అవంతి ఇంజనీరింగ్ కాలేజీ, చింతవలస ఎంవిజి ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసారు. ఈ పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ, వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు జిల్లా ముఖ్య ప్రాంతాల నుండి విద్యార్థులకు రవాణాసౌకర్యం కల్పించారు. మహరాజా చింతలవలస ఇంజనీరింగ్ కళాశాల బస్సులు కలెక్టర్ ఆఫీసు, రైల్వే స్టేషన్, విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్, కొత్తపేట నీళ్లట్యాంక్, రింగ్‌రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ కూడళ్ల మీదుగా ఐదు బస్సులు ఏర్పాటుచేసారు. సత్య ఇంజనీరింగ్ కళాశాల, అవంతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు అనువుగా ఉచిత బస్సులను నడుపుతున్నాయి. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మెడికల్ ప్రవేశ పరీక్ష 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష సమయానికి గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షా కేంద్రంలోని ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల వద్ద మజ్జిగ, మంచినీరు అందుబాటులో ఉంచాలని యంత్రాంగం ఆదేశించింది.