విజయనగరం

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాచిపెంట, ఏప్రిల్ 24: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండలంలోని పనుకువలస, విశ్వనాధపురం, గడివలస, కూనబందవలస, మిర్తివలస, కొత్తవలస గ్రామాల్లో సైకిల్‌యాత్రను నిర్వహించారు. తెలుగుదేశంపార్టీ మండల అధ్యక్షులు పిన్నింటి ప్రసాదబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి ఉంటుందన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయడంతోపాటు తిరుపతిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. సాలూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్ మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసమే వైకాపా ప్రత్యేక హోదాకోసం పోరాటాలు చేస్తుందే తప్ప రాష్ట్భ్రావృద్ధిగాని, రాష్ట్ర ప్రయోజనాలను గాని దృష్టిలో పెట్టుకుని పోరాటాలు చేయడం లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు రకాల దీక్షలతోపాటు ర్యాలీలు నిర్వహించి ప్రత్యేక హోదా ఆవస్యకతను ప్రజల దృష్టికి తీసుకువెళుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ పిన్నింటి ఈశ్వరరావు, టీడీపీ నాయకులు ముఖి సూర్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి ఈదుబిల్లి తిరుపతిరావు, ఎక్కుడు వెంకటేశ్వరరావు, మంచాల పారమ్మ, ఆత్మకూరి ఏడుకొండలరావు, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ సర్పంచ్‌ల పాత్ర కీలకం
పాచిపెంట, ఏప్రిల్ 24: పంచాయతీ సర్పంచ్‌ల పాత్ర కీలకమని ఎంపీడీఓ బి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పాచిపెంట మండల పరిషత్ కార్యాలయం వద్ద పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ చట్టాలపై అవగాహన కలిగి ఉంటే గ్రామాలాభివృద్ధిని సక్రమంగా చేపట్టవచ్చునన్నారు. పీసాచట్టంపై కూడా అవగాహన అవసరమన్నారు. సర్పంచ్‌లు విదులు, బాధ్యతలను తెలియజేస్తు గ్రామసభలను తూచాతప్పకుండా నిర్వహించాల్సి ఉందని, గ్రామసభల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈమేరకు ఉత్తమ సర్పంచ్‌గా ఎంపికైన పనుకువలస సర్పంచ్ ఆత్మకూరి సరోజిని, ఆజూరు సర్పంచ్ చోడిపల్లి రాధలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసీ సభ్యురాలు సలాది అనురాధ, ఎంపీపీ ప్రతినిధి ఇజ్జాడ తిరుపతిరావు, ఇఓపీఆర్‌డీ శ్రీహరి పాల్గొన్నారు.

ప్రశాంతంగా గురుకుల పాఠశాల ప్రవేశపరీక్ష
సీతానగరం, ఏప్రిల్ 24: ఉత్తరాంధ్రాలోని 5 జిల్లాల పరిధిలో ఉన్న గిరిజన విద్యార్థుల ప్రతిభ, గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. మండలంలోని జోగింపేట ప్రతిభా గిరిజన గురుకుల పాఠశాలలో మంగళవారం జరిగిన పరీక్షలను పార్వతీపురం ఐటీడీఏ పీఓ లక్ష్మీషా పరిశీలించారు. ఈమేరకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాలకు చెందిన 531మంది విద్యార్థులు ఈ పరీక్షలలో పాల్గొన్నారు. 8వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు 133, ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి 322మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈయన వెంట ప్రిన్సిపల్ నర్సింహులు, ఐటీడీఏ డీడీ నారాయణుడులు ఉన్నారు.