విజయనగరం

రేపు మంత్రి లోకేష్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 24: రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 26న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 9.20 గంటలకు పార్వతీపురంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత ఉదయం 10.15 గంటలకు ఐటిడిఎ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించనున్న ఐటిడిఎ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ సాధికార మిత్రలతో ముఖాముఖీ కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత గిరిజన వసతి గృహ విద్యార్థులతో కొద్ది సేపు ముచ్చటిస్తారు. బలిజపేట జూనియర్ కళాశాల నిర్మాణానికి, గదేవలస వసతి గృహ నిర్మాణానికి కూడా శంకుస్ధాపన చేస్తారు. అనంతరం ఆస్తుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడ నుంచి లోకేష్ బయలుదేరి మధ్యాహ్నాం 1.30 గంటలకు పార్వతీపురంలోని కలెక్టర్ క్యాంప్ ఆఫీసుకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నా భోజన విరామం అనంతరం మధ్యాహ్నాం 2.30 గంటలకు జిల్లేడువలస గ్రామంలో పర్యటిస్తారు. అక్కడ ఉపాధి హామీ పధకంతో చేపట్టిన రోడ్డును పరిశీలిస్తారు. మధ్యాహ్నాం 3.30 గంటలకు జోగింపేటలోని స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో మినీ ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గంలో విశాఖపట్నం చేరుకుంటరు. సాయంత్రం 6.30 గంటలకు విశాఖపట్నం పోర్టు గెస్ట్ హౌస్ చేరుకుంటారు. రాత్రి విశాఖలో బస చేస్తారు.
దృష్టి పెట్టండి...ప్రక్షాళన చేయండి
విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 24: విజయనగరం మున్సిపాలిటీలో అధికారుల పనితీరుపై దృష్టి సారించి ప్రక్షాళన చేయాలని మున్సిపల్‌కమిషనర్ ఎస్‌డి అనితకు పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు, ఉద్యోగుల పనితీరు ల పనితీరు అస్తవ్యస్తంగా ఉందని, ఆయా విభాగాల పనితీరుపై దృష్టి సారించి, ప్రక్షాళన చేయాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ రెవెన్యూ విభాగంలో ఉద్యోగుల పనితీరు దారుణంగా ఉంది. ఇంటిపన్ను వేయడానికి, ఇంటిపన్ను పేరు మార్చడానికి ఈ విభాగం ఉద్యోగులు ముప్పుతిప్పలు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా ఆస్తిపన్ను వసూలు చేసేందుకు డిమాండ్‌నోటీసులు జారీ చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఆస్తిపన్ను వసూలుకు సంబంధించి ఆస్తిపన్ను చెల్లింపుదారులకు డిమాండ్ నోటీసులు జారీ చేయకుండానే రెడ్‌నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం పనితీరు కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఈ విభాగంలో భవన నిర్మాణ ప్లాన్లకు సంబంధించిన ఫైళ్ళు సకాలంలో పరిష్కారం కావడంలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అత్యంత కీలకమైన మున్సిపాల్ ప్రజారోగ్య భాగం పనితీరు కూడా అత్యంత దారుణంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనిత ఆయా విభాగాల పనితీరుపై దృష్టిసారించి రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.