విజయనగరం

సేంద్రియ వ్యవసాయంతో అధిక దిగుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఏప్రిల్ 26: సేంద్రియ వ్యవసాయ పద్దతులను అవలంభించడం ద్వారానే అధిక దిగుబడులు పొందవచ్చునని ఉద్యానవన శాఖ అధికారి ఎం.శశిభూషణరావు అన్నారు. గురువారం మండలంలోని బంగారమ్మపేట గ్రామంలో రైతుకోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక ఎరువులు వాడడం వలన భూసారం క్రమంగా కోల్పోవడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సేంద్రీయ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను అన్ని పంటల్లో వాడడం ఎంతోమేలని చెప్పారు. ప్రభుత్వం కూడా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, యంత్ర పరికరాలు ఏవి అవసరమో ముందుగా గుర్తించి పంపిణీచేయడానికే ఈ సదస్సులు నిర్వహిస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో ఉప తహశీల్దార్ శ్రీనివాసరావు పశువైద్యాధికారి చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంలో ద్రవ జీవామృతం తయారీ
వేపాడ, ఏప్రిల్ 26: మండలంలోని జగ్గయ్యపేటలో రైతు కోసం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం చేపట్టేందుకు వీలుగా ద్రవజీవామృతం తయారీ విధానాన్ని వ్యవసాయ అధికారులు ప్రదర్శించారు. మండల వ్యవసాయ అధికారి తిరుపతిరావు పర్యవేక్షణలో రైతులు ద్రవజీవామృతాన్ని తయారు చేశారు. ఆర్ ఐ ప్రేమకుమార్ మాట్లాడుతూ ఎల్ ఇసి కార్డులు కోసం రైతులు ధరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. పశువైద్యాధికారి డాక్టర్ తులసి మాట్లాడుతూ గోకులం పథకంలో అందిస్తున్న రాయితీల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీ ఇవొ వౌనిక, పాపయ్య, మహేష్, రమణమ్మ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఏపీసీవొగా సీతారామునిపేట కార్యదర్శి
నెల్లిమర్ల, ఏప్రిల్ 26: మండలంలోని సీతారామునిపేట పంచాయతీ కార్యదర్శి పి.రమాదేవి సహాయ వాణిజ్య పన్నుల అధికారి ఉద్యోగానికి అర్హత సాధించారు. రమాదేవి 2016లో గ్రూప్-2 పరీక్షలు హాజరై ఉద్యోగ అర్హత సాధించారు. ఈనెల విడుదలైన ఏసీపీవొ ఫలితాలలో ఎస్సీ కేటగిరిలో జిల్లాలో 274మార్కులు సాధించి తృతీయ స్థానం సాధించారు. రమాదేవి గుర్ల మండలం పల్లె గండ్రేడు గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబం నుంచి ఎన్నో అష్టకష్టాలు పడి బీటెక్ చదివింది. పోటీ పరీక్షల్లో 2014లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయింది. అప్పటి నుంచి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నది. ఆమె ఉద్యోగం చేస్తూ, మరోపక్క పోటీ పరీక్షలకు హాజరై గ్రూప్-2లో ఏసీపీవొగా అర్హత సాధించారు.