విజయనగరం

కలెక్టర్ సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), మే 22: పట్టణంలో జిల్లాకలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాకలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మొట్టమొదటిసారిగా పట్టణంలో పర్యటించారు. అంబటిసత్రం జంక్షన్ నుంచి కొత్తపేట నీళ్లట్యాంక్‌కు వెళ్లే రోడ్డు విస్తరణపనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయనగం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ఆర్ అండ్ బి, వుడా, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోను నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని తెలిపారు. విజయనగరం సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక విశేషాలు ప్రస్పుటించేవిధంగా ఆకర్షణీయమైన కొటేషన్లతో గ్లోసైన్ బోర్డులు, ముఖ్య ప్రాంతాలు తెలిసేవిధంగా సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలో ఆక్రమణల తొలగింపు, పార్కుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణపై తగిన శ్రద్ద వహించాలన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో రోడ్ల భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు విస్తరణపనుల గురించి ఆశాఖ ఎస్‌ఇ కాంతిమతి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కనకల మురళీమోహనరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్‌డి అనిత, మున్సిపల్ అసిస్టెంట్ సిటీప్లానర్లు వి.శోభన్‌బాబు, కె.హరిదాస్ తదితరులు పాల్గొన్నారు
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకొండి
* కలెక్టర్ ఆదేశం
విజయనగరం (్ఫర్టు), మే 22: పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ఆర్ అండ్ బి, మున్సిపల్ ఇంజనీరింగ్, రోడ్డుసెఫ్టీ అధికారులతో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చర్చించారు. అంతకు మయూరికూడలి, బాలాజీకూడలి తదితర ప్రాంతాల్లో పర్యటించి ట్రాఫిక్, బ్యూటిఫికేషన్‌కు అవకాశాలను పరిశీలించారు. రింగురోడ్డు పరిశీలనలో సెంట్రల్ మీడియన్ ఎత్తు తక్కువగా ఉందని, మరికొంత ఎత్తు పెంచాలని సూచించారు. అదేవిధంగా మీడియన్ మధ్యలో ఆదాయం సమకూరేలా ప్రకటనల స్థంభాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన పందులను రోడ్లపై విచ్చలవిడిగా సంచరించకుండా పూర్తిగా నివారించాలన్నారు. పశువులను రోడ్లపై విడిచిపెట్టకుండా యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. మున్సిపల్ అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేసే యజమానులకు జరిమానాలు విధించాలన్నారు. ముఖ్యంగా పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తోపుడు బల్లకు లైసెన్సులు మంజూరు చేయాలని, తోపుడు బల్ల వ్యాపారులు చెత్తాచెదారాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా వారికి క్రమపద్ధతి, క్రమశిక్షణపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనిత, మున్సిపల్ ఇంజనీర్ రాజేంద్రకృష్ణ, రోడ్డు సెఫ్టీ డిఎస్‌పి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.