విజయనగరం

జిల్లాలో 598 పంచాయతీలలో ఎల్ ఇడి లైట్లు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం,మే 22: జిల్లాలోని 921 పంచాయతీలకుగాను 598 పంచాయతీలలో ఎల్ ఇడి వీథిలైట్లు ఏర్పాటు చేశామని జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ చెప్పారు. మంగళవారం మండలంలో పురిటిపెంట గ్రామపంచాయతీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సంధర్బంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 598 పంచాయతీలలో పంచాయతీ నిధులుతో ఎల్ ఇడి లైట్లను ఏర్పాటు చేశామన్నారు. ( ఇ ఎస్ ఎల్) సంస్ద ఆధ్వర్యంలో 64 పంచాయతీలలో వీధి లైట్లు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 258 పంచాయతీలుకుగాను పంచాయతీ నుండి ప్రతి మూడు నెలలకు 150 రూపాయలు చెల్లించడం ద్వారా ఆ నిధులతో ఎల్ ఇడి లైట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నెలాఖారులోగా శతశాతం పంచాయతీలలో ఎల్ ఇడి లైట్లు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. అలాగే పంచాయతీ నిధులు నుండి గ్రామాలలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో 19 లక్షలకుగాను 17,500 చేతి బోర్లుతోపాటు, ఎంపి స్కీములు, సిపి డబ్ల్యు స్కీమ్‌లు, రక్షిత మంచినీటి పధకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 2017-18 ఆర్దిక సంవత్సరానికి సంబందించి ఇంటిపన్నుల బకాయిలు 15 కోట్లు ఉండగా 12కోట్ల వరకు వసూళ్లు చేశామన్నారు. పన్నులు చెల్లించిన వారి వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిచేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంత వరకు ఆరుకోట్ల రూపాయలు చెల్లింపుదారుల వివరాలు ఆన్‌లైన్ చేశామన్నారు. అలాగే చెత్తనుండి సంపద తయారీ కేంద్రాలుకు సంబందించి జిల్లాలో 627 పంచాయతీలలో కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేయగా 91 కేంద్రాలు పూర్తికాగా 37 కేంద్రాలలో వర్మీ కంపోస్టును తయారు చేయడం జరుతుందన్నారు. జిల్లాలో 56 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయడం జరిగిందని, మరో 61పోస్టులు కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తామని తెలిపారు. అనంతరం పంచాయతీ ఆవరణలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ముఖ్యంగా ములగ మొక్కలను పెంపకం చేసి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండల సురేష్, ఎంపిడీవొ జి.జనార్థనరావు తదితరులు పాల్గొన్నారు.

రాజరాజేశ్వరీ దేవికి ప్రత్యేక పూజలు
బొండపల్లి, మే 22: మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వంభూగా వెలసిన రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి మంగళవారం అధిక జేష్ఠమాస అష్టమి సందర్భంగా ప్రధాన అర్చకులు దూసి శ్రీధర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు అమ్మవారు అష్ట మాతృకులుగా అవతరించినరోజు అని, ప్రతి అష్టమి రోజు అమ్మవారు దుష్ట శిక్షణార్థమై భూలోకంలో గ్రామసంచారం చేస్తుంటారని, అంతేకాకుండా కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం రాజరాజేశ్వరీదేవికి మంగళవారం ఇష్టమైన రోజుకావడం మరో ప్రత్యేక అని చెప్పారు. ఈ రోజు అమ్మవారికి కుంకుమ పూజ, స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి జగన్మాతగా రకరకాల పుష్పాలతో అలంకరించామని తెలిపారు. తగరపువలస, విశాఖపట్నం, విజయనగరం, గజపతినగరం తదితర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మేళతాళాలతో ముడుపులు,మొక్కులు చెల్లించుకున్నారు.