విజయనగరం

అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఛలో సెక్రటేరియట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మే 24: అగ్రీ గోల్డ్ సంస్దకు డిపాజిట్లు కట్టి తీవ్రంగా నష్టపోయిన ఖాతాదారుకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30,31వ తేదీలలో గుంటూరు నుండి వెలగపూడి వరకు ఆత్మఘసు పాదయాత్ర నిర్వహిస్తామని అగ్రీ గోల్డ్ బాధితులు, ఏజెంట్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇ వి నాయుడు అన్నారు. గురువారం స్దానిక శ్రీకృష్ణా విద్యా పీఠ్‌లో చలో సెక్రటేరియేట్‌కు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50వేల మంది ఈ కార్యక్రమంకు హాజరుకానున్నట్లు చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రి గోల్డ్ ఆస్దులును విక్రయించి బాధితులు అందరికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ఇంతవరకు కోర్టులో వివాదం ఉందనే సాకుతో కాలయాపన చేస్తున్నారు తప్పా సమస్యను పరిష్కరించేదిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్టవ్య్రాప్తంగా 20 లక్షలు మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. అగ్రీ గోల్డ్ సంస్ద మూత పడటంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 130 మంది ఆత్మహత్యలుకు పాల్పడ్డారని అందులో102మందికి మాత్రమే ఇప్పటివరకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందజేందన్నారు. ఇంకా 34 మందికి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. అగ్రీ గోల్డ్ ఆస్దులలో పర్యాటకం, ఇతర రంగాలుకు అవసరమైన భూములు ఉన్నాయని వాటిని తీసుకొని ఆ డబ్బుతో బాధితులకు డిపాజిట్లు చెల్లించాలన్నారు. అగ్రీ గోల్డ్ సమస్యపై ఇతర ప్రజాసంఘాలు,ప్రతిపక్షపార్టీలు మద్దతు తీసుకుని ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జూన్ 6న అగ్రీ గోల్డ్ కేసు హైకోర్టులో విచారణకు రానున్నదని ప్రభుత్వం బాధితులు పక్షాన నిలబడి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మజ్జి సూరప్పడు, బ్రాంచి కమిటీ అధ్యక్షుడు చీమల వెంకట రమణ, కార్యదర్శి బి సత్య రమేష్, ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు, ఇ.సత్యారావు, బి.సూర్యనారాయణ, కర్రి అప్పలరాజు, జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.
రబీ ధాన్యాన్ని కొనే నాధుడు కరువయ్యాడు!
గజపతినగరం, మే 24: రబీధాన్యాన్ని కొనేనాధుడు లేకపోవడం అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై దృష్టిపెట్టక పోవడంతో జిల్లాలోని రబీలో వరిసాగుచేస్తున్న రైతులు మద్దతు ధరకన్నా వంద నుండి 150 రూపాయల క్వింటా ధాన్యాన్ని దళారాలుకు విక్రయించుకుని దౌర్భాగ్య పరిస్థితి జిల్లాలో నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీలో పార్వతీపురం, బొబ్బిలి డివిజన్‌తోపాటు గజపతినగరం సబ్ డివిజన్ పరిధిలో పది వేల హెక్టార్లకు పైగా ధాన్యాన్ని పండించారు.ప్రతి ఏడాది జనవరి నుండి ఏప్రిల్ వరకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్నికొనుగోలు చేస్తుండేది. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు విరుద్ధంగా రైతులు తాము పండించిన పంటను పూర్తిగా అమ్ముకుని ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరించేందుకు అవకాశం లేకుండా ఉన్నచోట్లకే ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 16 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. గజపతినగరం సబ్ డివిజన్‌కు సంబంధించి నాలుగు మండలాలకు స్థానిక వ్యవసాయ పరపతి సంఘంలో ఈ నెల 21న కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు నష్టం వచ్చినా నిల్వ చేసే అవకాశం లేక దళారులు చెప్పిన ధరకే ధాన్యాన్ని విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవ రకు కేవలం 259 మంది రైతులు నుండి 3,774 క్వింటాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేసి 5కోట్ల 20లక్షల రూపాయల చెల్లింపులు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్రాలకు గోనె సంచులు మంజూరు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంజూరు చేసిన కేంద్రానికి సమీపంలోనే మిల్లర్లకు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.