విజయనగరం

ఉపాధి కూలీ బకాయిలను వెంటనే చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), మే 26: జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు బకాయిలను వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక ఎల్‌బిజి భవన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు 200 రోజుల పని కల్పించడంతోపాటు కనీస కూలీ 300 రూపాయలు ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించకుండా చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. గత ఏడాది నుంచి పని బిల్లులు చెల్లించకుండా కూలీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఉపాధి పని, ఇళ్లులు, ఇంకుడు గుంతలు బిల్లుల బకాయిలు 53 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. చట్టప్రకారం 14 రోజులకు చెల్లించాలనే నిబంధన అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలులో అవార్డులను జిల్లా సొంతం చేసుకుంటున్నా కూలీ గిట్టుబాటు కాకపోవడంతో వలసలు తగ్గడం లేదని సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పనిముట్లు, మజ్జిగ, టెంట్లు, మెడికల్ కిట్ల పంపిణీ కూడా సక్రమంగా జరగడం లేదన్నారు. మేట్లకు పారితోషికం రద్దు చేశారని, కరవుమండలాలకు ఎక్కువ రోజులు పని కల్పించడం లేదని ఆయన తెలిపారు. ఈ నేపధ్యంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని, పనిరోజులు, కూలీరేట్లు పెంచాలని, సదుపాయాలు కల్పించాలని, పోస్ట్ఫాసుల ద్వారానే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30వతేదీన అన్ని ఎంపిడిఓ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామన్నారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు రమణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలి
బొబ్బిలి(రూరల్), మే 26: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేనిపక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఏ కృపారావు, జి ఆదినారాయణలు హెచ్చరించారు. ఈ మేరకు తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు వేతనాల పెంపు జీఓను తక్షణమే విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో వచ్చేనెల 6వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే జూన్ 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నామన్నారు. రెవెన్యూ సహాయకులకు 10,500 వేతనాల పెంపు జీఓను విడుదల చేయాలని, బయోమెట్రిక్ నుంచి వీఆర్‌ఏలను మినహాయించాలని, నామినీలను వీఆర్‌ఏలుగా నియమించాలని, పే స్కేల్ ఇవ్వాలని, 010 పద్దు ద్వారా వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి పలు పర్యాయాలు సమస్యలను తెలియజేసిన ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. సీటు నాయకులు పి శంకరరావు, వీఆర్‌ఏల సంఘం నాయకులు ఎస్ సింహాచలం, జి అప్పారావు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

ఉపాధి వేతనదారులు సమయపాలన పాటించాలి
బొబ్బిలి(రూరల్), మే 26: ఉపాధి వేతనదారులు విధిగా సమయపాలన పాటించాలని ఉపాధి హామీపథకం ఏపీఓ కర్రి కేశవరావు కోరారు. మండలం కలువరాయి గ్రామంలో శనివారం మేట్‌లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు, మధ్యాహ్నం 4గంటల నుంచి 6గంటల వరకు విధిగా వేతనదారులు పనులు చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండని వారు పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మేట్‌లు విధిగా సమయపాలన పాటిస్తే కూలీలు కూడా సమయపాలన పాటించే అవకాశం ఉందన్నారు. శనివారం 276మందిని పనులకు వెళ్లకుండా నిలుపుదల చేసినట్లు స్పష్టం చేశారు. సక్రమంగా పనులు చేసుకుంటే వేతనం గిట్టుబాటు అవుతుందన్నారు. ఉపాధి హామీపథకంలో ఎన్నో రకాల పనులు మంజూరవుతున్నాయని, వాటిని రైతులు, వేతనదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పనులు చేసిన కూలీలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా వౌళిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణమూర్తి, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు పాల్గొన్నారు.