విజయనగరం

పర్యవేక్షణకు అధికారులు కావలెను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూన్ 19: ప్రభుత్వం ప్రజలకోసం ఎన్నో పధకాలు ప్రవేశపపెడుతున్నప్పటికీ అందుకుతగిన విధంగా సిబ్బందిని నియమించకపోవడంతో లబ్ధిదారులకు ఏ విధంగా అందుతున్నాయో తెలియని పరిస్ధితి నెలకొంది.ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షణకు అధికారులు అవసరం. గజపతినగరం సమగ్ర స్ర్తిశిశు సంక్షేమ కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. ఐసిడి ఎస్ కార్యాలయం పరిధిలోని గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ మండలాలలో సుమారు 200 అంగన్వాడీ కేంద్రాలు, మినీ అంగన్వాడీ కేంద్రాలు కలవు. అయితే వాటిని పర్యవేక్షించడానికి తొమ్మిదిమంది పర్యవేక్షణ అధికారులు ఉండాలి కాని కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా ఒక ఎసిడిపి ఉన్నప్పటికీ అతనని డిప్యూటేసన్ వేరే చోటకు వెళ్లిపోయారు. ఉన్న ఇద్దరు పర్యవేక్షులకు ఈ పని చాలదంటూ గ్రామ ప్రత్యేకాధికారులగా, ఇతర ప్రభుత్వ సేవలకు ఉపయెగించుకోవడంతో అసలు లక్ష్యం నెరవేడడం లేదు. ఇటీవల కాలంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను మరింత పెంచింది. కార్యకర్తలకు, ఆయాలకు పలు శిక్షణాకార్యక్రమాలు నిర్వహించింది. ఈ పనులు పర్యవేక్షించడానికి తగిన సిబ్బందిని నియమిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

భూమి సదస్సులపై విస్తృత ప్రచారం చేయండి
గజపతినగరం, జూన్ 19: భూమి సదుస్సులపై గ్రామాలలో విస్తృత ప్రచారం చేయాలని తహాశీల్ధార్ బి.శేషగిరిరావు అన్నారు. మంగళవారం స్ధానిక తహాశీల్ధార్ కార్యాలయంలో వి ఆర్వోలకు భూమి సదస్సులకు సంబందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సులలో కేవలం భూ సమస్యలకు సంబంధించిన ధరఖాస్తులను మాత్రమే రైతుల వద్ద నుంచి స్వీకరించాలని సూచించారు. రేషన్ సంబంధంచినవి, ఫించన్‌కు సంబంధించిన ధరఖాస్తులు స్వీకరించరాదన్నారు. ఈనెల 20 నుంచి జూలై 5వతేదివరకు నిర్వహించనున్న సదస్సులను రైతులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో ఇందుకు సంబంధంచి రెండు బృందాలు పర్యటిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఉపతహశీల్దార్ శ్రీనివాసరావు, ఆర్. ఐ సతీష్, సర్వేయర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సాక్షర్‌భారత్ సమన్వయకర్తలను కొనసాగించాలి
* ఉద్యోగ భద్రత కోసం ఆందోళనలు
గజపతినగరం, జూన్ 19: సాక్షర్‌భారత్ సమన్వయకర్తలను ప్రభుత్వం తక్షణమే కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని సి ఐటియు డివిజన్ కార్యదర్శి పురం అప్పారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయోజనులను అక్షరాస్యులగా తీర్చిదిద్దడానికి 2010 ఆగష్టు 1నుంచి నియమించిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాక్రమాలలోను వారి సేవలను వినియోగించుకుందన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు నిర్మాణంలోను, బి ఎల్‌వోలుగా ఇలా ఎన్నో కార్యక్రమాలలో ఉపయోగించుకుందన్నారు. జీతాలు సకాలంలో ఇవ్వకపోయినా సమన్వయకర్తలు బాధ్యతతో పనిచేశారని తెలిపారు. సేవలు అందిస్తున్న సమన్వయకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించకుండా తొలగించడం దుర్మార్గమన్నారు. గజపతినగరం డివిజన్ పరిధిలో ఐదు మండలాలలో 310మంది సమన్వయకర్తలు, ఐదుగురు మండలస్ధాయి సమన్వకర్తలు పనిచేస్తున్నారని చెప్పారు. సమన్వయకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలనికోరుతూ ముందు జిల్లా స్ధాయిలో ఆందోళన చేస్తామని, తరువాత నియోజకవర్గం, మండలస్ధాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గజపతినగరం, బొండపల్లి గ్రామ సమన్వయకర్తలు నరవ ఆదినారాయణ, మామిడి వెంకటరమణలు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం
గజపతినగరం, జూన్ 19: గ్రామాభివృద్దిలో సర్పంచ్‌లే కీలకమని ఎంపీడీవొ ఎస్. కృష్ణవేణమ్మ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్యదర్శులకు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో లేదా మరే ఇతర నిధులతో చేపట్టబోయే పనుల యొక్క ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ముందుగా గ్రామాలలో పర్యటించి సమస్యలను గుర్తించాలని సూచించారు. 11స్టార్లు, 7పథకాలు, 5అంశాలలో అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. భవిష్యత్‌లో బిల్లులు మంజూరు కావాలంటే ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచుకోవాలని అన్నారు. ప్రభుత్వం సాధారణ నిధులు ఖర్చు విషయంలో నిబంధనలు విధించిందని చెప్పారు. కార్యక్రమంలో ఇవొపీ ఆర్డీ జి.జనార్థనరావు, గ్రామ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి రెవెన్యూ గ్రామసభలు
బొండపల్లి, జూన్ 19: ఈ నెల 20వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు గ్రామాలలో రెవెన్యూసభలు నిర్వహించడం జరుగుతుందని తహశీల్దార్ డి.బాపిరాజు అన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ గ్రామసభలు రెండు బృందాలు నిర్వహిస్తాయని ఒక బృందానికి తాను, మరో బృందానికి ఉప తహశీల్దార్ నేతృత్వం వహిస్తారని చెప్పారు. ఈ గ్రామసభలు ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు జరుగుతాయని అన్నారు. 20న జె.గుమడాం, కొత్తపాలం, 21న ఒంపల్లి, గొట్లాం, 22న వేండ్రాం, గరుడుబిల్లి, 23న ఎం.కొత్తవలస, అంబటివలస, రోళ్ళవాక, అయ్యన్న అగ్రహారం, 25న మరువాడ, వెదురవాడ, ఎం.కె.పాలెం, 26న బి.రాజేరు,జి.పి.అగ్రహారం, 27న కనిమెరక, రరుూంద్రం, కె.జి.అగ్రహారం, చామలవలస, 28న నెలివాడ, గిట్టుపల్లి గ్రామాలలో రెవెన్యూ సభలు జరుగుతాయని తెలిపారు. 29న బిళ్ళలవలస, ముద్దూరు, తమటాడ, 30న కెరటాం, రాచకిండాం, జూలై 2న దేవుపల్లి, ఐ.వి.అగ్రహారం, కిండాం అగ్రహారం, 3న గొల్లుపాలెం, కొండకిండాం, 4న బొండపల్లి, సి.టి.పల్లి గ్రామాలల్లో సభలు నిర్వహిస్తామని రైతులు ఈ సభలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.