విజయనగరం

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 21: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అమలు చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్ధను రద్దు చేయాలని ఎపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.కృష్ణ డిమాండ్ చేశారు. ఎపిటిఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజిక ఉద్యోగ భద్రత లేని ఈ విధానంలో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టే నియామకాలన్నీ శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలన్నారు. జిల్లా విద్యాపరిక్షణ కమిటీ కన్వీనర్ జెసి రాజు మాట్లాడుతూ సిపిఎస్‌ను రద్దు చేయాలన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా రద్దే లక్ష్యంగా ఉద్యమాలు చేపడతామన్నారు. విద్యా వ్యాపారాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్ధల దోపిడీని అరికట్టాలన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల రెండవతేదీన కలెక్టరేట్ ధర్నా చేస్తామన్నారు.
ఈ సమావేశంలో విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులు వై.వెంకటరమణ, దామోదరనాయుడు, అప్పలరాజు, సిహెచ్.వెంకటరమణ, జిసిహెచ్ సత్యనారాయణ పాల్గొన్నారు.

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి
లక్కవరపుకోట,జూన్ 21: ఎస్.కోట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఎమ్మెల్యే లలితకుమారి అన్నా రు.గురువారం ఎల్.కోటలో ఆమె నివాసంలో జరిగిన పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జమ్మాదేవిపేట, ఎల్.కోటల్లో జరిగిన సిఎం సభలు విజయవంతం చేసినందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమల్లో ఎక్కడా రాజీ పడకుండా అంచెలంచెలుగా అమలు చేస్తూ ముం దుకు వెళుతుందని, రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ కూడా పథకాలు అమలు ఆగకుండా చూడడంలో చంద్రబాబు కృషి ఎంతో చెప్పుకోదగినదని ఆమె అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును నాయకులు ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు అర్హులైన వారికి లబ్దిచేకూరే విధంగా ప్రయత్నం చేయాలని ఆమె అన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వంచేస్తున్న కృషిని రైతులకు వివరించాలని, వారికి నిరంతరం వెన్నుదన్నుగా ఉంటూ విత్తనపంపిణీ, విజయవంతంగా కొనసాగించాలని, సబ్సిడీ విత్తనాలను అందరికీ అందేలా చూడాలని ఆమె అన్నారు. రానున్నరోజుల్లో టీడీపీ బలోపేతానికి బూత్ లెవెల్ ను ంచి ప్రయత్నం చేయాలన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోళ్ళ రాంప్రసాద్‌తోపాటు టీడీపీ అధ్యక్షుడు ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.