క్రైమ్/లీగల్

వేధింపులు తాళలేక దళితయువకుడు ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, జూన్ 29: నెల్లిమర్ల ఎపి బెవరేజర్స్‌లో ఎక్సైజ్ ఎస్సై వేధింపులు తాళలేక దళిత యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ మేరకు బాధితుడు శ్రీనివాసరావు వేధింపులపై నెల్లిమర్ల ఎస్సైకు ఫిర్యాదు చేస్తూ రాసిన ఉత్తరాన్ని జేబులో ఉంచుకుని పురుగులు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు అందించిన వివరాల ప్రకారం స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన జామి శ్రీనివాసరావు ఎపి బెవరేజర్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా ఎక్స్‌సైజ్ ఎస్సై కరణం చిన్నంనాయుడు కులంపేరుతో దూషిస్తూ వేధింపులకు పాల్పడేవాడని అన్నారు. అంతేకాకుండా బెవరేజర్స్‌లో చిన్నచిన్న దొంగతనాలు కూడా ఎస్సై చేయించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే విధంగా బెవరేజర్స్‌కు వచ్చే మద్యం వాహనాల్లో పగిలిన బాటిళ్ళను తక్కువగా ఉన్నా ఎక్కువగా నమోదు చేయించి మిగిలిన బాటిల్స్‌ను ఎస్సై అమ్ముకునేవాడని ఆరోపించారు. ఈ విషయం బయటకు పొక్కితే ఉద్యోగం నుంచి తొలగిస్తానని భయపెట్టేవాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మద్యం బాటిల్స్ అమ్మకాలను తెలుసుకున్న ఎస్‌ఒలు, కానిస్టేబుళ్ళు మమ్మలిని వేధింపులకు గురిచేసి అశోక్ అనే వ్యక్తిని పనిలోకి రానీయకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. అదే సమయంలో నాతోపాటు పనిచేస్తున్న ఎనిమిది మందిని బాటిల్స్ అమ్మకం విషయాన్ని బయటపెట్టామని కక్ష సాధింపులకు పాల్పడేవారని వివరించారు. దీంతోపాటు ఎస్సై చిన్నంనాయుడు గత రెండు సంవత్సరాలుగా కుల దూషణతో వేధింపులకు పాల్పడుతున్నాడని అన్నారు. ఈ వేధింపులు తాళలేక పురుగులు మందు తాగనని చెప్పాడు. వేధింపులకు పాల్పడిన ఎస్సై చిన్నంనాయుడును కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు శ్రీనివాసరావును కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మిమ్స్‌కు తరలించారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.