విజయనగరం

సస్పెండ్ కౌన్సిలర్ సమావేశ మందిరంలోకి రావడంతో వాగ్వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, జూలై 21: పురపాలక సంఘం పరిధిలో ఉన్న 29వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కిరణ్‌కుమార్‌ను రెండునెలలుపాటు సస్పెండ్ చేసినప్పటికీ శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం హాల్లోకి రావడంతో కమిషనర్ శంకరరావు, కౌన్సిలర్ కిరణ్‌కుమార్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. ఛైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా సమావేశ మందిర గేటు వద్ద అటెండర్‌నుతోసుకుని కిరణ్‌కుమార్ వచ్చి సీటులో కూర్చొన్నారు. దీంతో అజెండాలోని అంశాలను నిలిపివేసి కమిషనర్ శంకరరావు జోక్యం చేసుకుని సస్పెండ్ చేసిన సభ్యుడు కిరణ్‌కుమార్ సమావేశహాల్లోకి రావడం సభ్యత కాదని, అజెండా పంపించలేదని, ఎటువంటి సమాచారం ఇవ్వకపోయిన సమావేశ హాల్లోకి రావడం మంచిది కాదని హెచ్చరించారు. బయటకు వెళ్లిపోతే మర్యాదగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు కిరణ్‌కుమార్ జోక్యం చేసుకుని సస్పెండ్ చేసినట్లు నోటీస్‌గాని, ఎటువంటి కాగితం ఇవ్వలేదని స్పష్టం చేశారు. కమిషనర్ స్పందిస్తు గత సమావేశంలోనే సస్పెండ్ చేసినట్లు ప్రకటించామని, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొనడంతో వీరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం కిరణ్‌కుమార్ బయటకు వెళ్లిపోయారు. మరో వార్డు కౌన్సిలర్ రేజేటి కృష్ణవేణి జోక్యం చేసుకుని నోటీసులు ఇవ్వకుండా సభ్యులను బయటకు ఎందుకు పంపించారని ప్రశ్నించడంతో కమిషనర్ స్పందిస్తు నోటీసులు ఇవ్వవల్సిన అవసరం లేదని మరోసారి సమాధానం చెప్పడంతో కృష్ణవేణి అజెండా కాపీని తీసుకుని బయటకు వెళ్లిపోయారు. ఈ విషయంపై వైస్ ఛైర్మన్ చోడిగంజి రమేష్‌నాయుడు మాట్లాడుతూ గేటు వద్ద ఎవరిని రానివ్వకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. రామ్మూర్తినాయుడు, శ్రీ్ధర్‌లు జోక్యం చేసుకుని సమావేశాలు సక్రమంగా కానివ్వడం లేదని కౌన్సిలర్లంతా ఏకగ్రీవ తీర్మాణంతో రెండునెలలు సస్పెండ్ చేశామని, అయినప్పటికీ లోనికి రావడంతో మరలా సమస్య మొదలైందని పేర్కొన్నారు.