విజయనగరం

గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 17: గ్రామపంచాయతీలకు ప్రభుత్వం తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రత్యేక అధికారుల పాలన రద్దు చేయాలని లోకల్ గవర్నమెంట్స్‌ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 243ఇ ప్రకారం అయిదేళ్లు పూర్తయిన వెంటనే గ్రామపంచాయతీలకు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించవల్సిందేనని అన్నారు. ప్రత్యేక అధికారుల పాలన రద్దు చేయాలి, గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి అనే అంశంపై ఈనెల 14 నుంచి 16వతేదీ వరకు హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ప్రత్యేక అధికారుల పాలన రద్దు చేయడమేకాకుండా గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేవరకూ జాతీయస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. ఈనెలాఖరులో ఢిల్లీ, విజయవాడల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. 73వ రాజ్యాంగ సవరణ 243ఇ ప్రకారం అయిదేళ్లు పూర్తయిన వెంటనే ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగ ఎన్నికలు నిర్వహించాలని, ఎంపి, ఎమ్మెల్యేల ఎన్నికలకు సంబంధించి ఇదే చట్టం ప్రకారం అయిదేళ్లు పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహించినప్పుడు గ్రామపంచాయతీలకు ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని అప్పలనాయుడు తెలిపారు. ఈ సమావేశంలో ఛాంబర్‌సభ్యులు రామేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.