విజయనగరం

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (పూల్‌బాగ్), నవంబర్ 21: పట్టణంలోని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం రాత్రి బహుజన గళం ఆధ్వర్యంలో జరిగిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.పలు పాఠశాలలకు చెందిన విద్యార్థ్ధులు నాటికలను ప్రదర్శించారు. పద్యం విశిష్టతను తెలుపుతూ ప్రదర్శించిన పద్యతోరణం నాటిక ఆకట్టుకుంది. నాడునేడురేపు నాటికలో ప్రస్తుత పరిస్థితులను వివరంగా తెలిపారు. తెలుగుతల్లి, దటీజ్ బుద్ధ నాటికలు ఆకట్టుకున్నాయి. మయూరి నృత్యాలయం విద్యార్ధినుల నృత్యప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో బహుజన గళం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సంస్కృతకళాశాల ప్రిన్సిపాల్ స్వప్నహైందవి, ప్రొఫెసర్ ఏ. ఎస్.ప్రకాశరావు ,పివినరసింహరాజు, రామానాయుడు పాల్గొన్నారు.
వ్యాపారులకు భారీ జరిమానా
విజయనగరం(టౌన్),నవంబర్ 21: ఆహార పదార్ధాల్లో కల్తీకి పాల్పడిన వ్యాపారులకు భారీగా జరిమానాలను విధిస్తూ జాయింట్ కలెక్టర్ రామారావు శనివారం తీర్పు ఇచ్చారు. నాణ్యతా ప్రమాణాలు లేని పెరుగును అమ్ముతున్న బొబ్బిలికి చెందిన మెస్ యజమాని చెలికాని రామారావుకు 25 వేల రూపాయలు జరమానా విధించారు.
అలాగే మరో మెస్ నిర్వాహకుడు గణపతిరావుకు 15వేల రూపాయలు, సాలూరు మండలం తోణాం సంతలో కల్తీ కారంపొడిని అమ్ముతున్నవ్యాపారి నూకరాజుకు10వేలరూపాయలు, అలాగే మరొకవ్యాపారి నారాయణ రావుకు 10వేల రూపాయలు అపరాధ రసుం విధిస్తూ జెసి తీర్పు నిచ్చారు.

అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు
విజయనగరం (పూల్‌బాగ్),నవంబర్ 21: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఆలయ హుండీలను శనివారం లెక్కించారు. పైడితల్లి అమ్మవారి కళ్యాణమండపంలో హుండీల లెక్కింపుజరిగింది. చదురుగుడి హుండీల ద్వారా 1335191రూపాయిలు, 17గ్రాముల బంగారం, 350గ్రాముల వెండి సమకూరగా, వనంగుడి హుండీల ద్వారా 192221 రూపాయిలు ఒకగ్రాము బంగారం, 18గ్రాముల వెండి సమకూరింది. పైడితల్లి ఆలయ దత్తాలయమైన వేంకటేశ్వర ఆలయ హుండీల నుండి 79380రూపాయిలు, 500మిల్లీగ్రాముల బంగారం,170 గ్రాముల వెండి సమకూరింది. ఆలయ కార్యనిర్వహణాధికారి భానురాజా పర్యవేక్షణలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది.
వెంకన్నకు తోమాలసేవ
విజయనగరం(పూల్‌బాగ్),నవంబర్ 21: పట్టణంలోని టి.టి.డి.కళ్యాణమండపంలో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి తోమాలసేవ, అర్చన, అభిషేకపూజలు జరిపారు. తులసిమాలలతో అలంకరించారు. ఆలయ అర్చకులు నరసింహాచార్యులు పూజాదికాలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యసేవలు

విజయనగరం(టౌన్),నవంబర్ 21: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పేద రోగులకు కార్పొరేట్ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలుతీసుకుంటున్నట్లు ఆసుపత్రి సలహాసంఘం చైర్మన్ డాక్టర్ వి ఎస్ ప్రసాద్ తెలిపారు. శనివారం ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన కేంద్ర ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం కోటి అరవై లక్షలు మంజూరు చేసిందని చెప్పారు. ఘోషాసుపత్రిలో అభివృద్ధిపనులు కోటి రూపాయలతో చురుగ్గా జరుగుతున్నాయని చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతకింద కేంద్ర పౌరవిమాన సంస్ధ ద్వారా కేంద్ర పౌరవిమాన యాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు చొరవతో కోటి రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. ఈనిధుల్లో తొలివిడతగా విడుదల అయిన 57 లక్షలతో లాప్రోస్కోపిక్ ఆపరేషన్ పరికరాలు, ఎనలైజర్, సెల్ కౌంటర్ వంటివి సమకూరాయని వివరించారు. వీటిని 23న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభిస్తారని చెప్పారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై సమావేశంలో చర్చించి పూర్తిస్ధాయి నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. కొన్నిసమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. స్ట్ఫా సమస్య, వౌళిక సమస్యల పరిష్కారంపై సలహా సంఘం దృష్టిసారించి పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి చర్యలుతీసుకుంటుందని చెప్పారు. ఈసమావేశంలో డిసిహెచ్ డాక్టర్ రామారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు పాల్గొన్నారు.