విజయనగరం

ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 17: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వివిధ సమస్యలపై విన్నవించారు. సోమవారం ఎస్పీ పాలరాజు ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. వాటిలో డెంకాడకు చెందిన సత్యనారాయణ రాజు తన భూమిని ఆక్రమించుకున్నారని, విశాఖకు చెందిన రాము ఇంటి నిర్మాణం గురించి, పట్టణానికి చెందిన బంగారుబాబు తనకు అద్దె చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. మక్కువకు చెందిన రామినాయుడు తన భూమిని బలవంతంగా కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. వీటిని పరిశీలించి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

అన్ని గ్రామాల్లో స్వచ్చతయే సేవా: కలెక్టర్

విజయనగరం, సెప్టెంబర్ 17: జిల్లాలోని అన్ని గ్రామాల్లో స్వచ్చతయే సేవా కార్యక్రమాలను విధిగా చేపట్టాలని కలెక్టర్ హరి జవహర్‌లాల్ అదికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరువరకు ప్రతి రోజు నిర్ణయించిన కార్యక్రమాలను విధిగా చేపట్టాలన్నారు. అన్ని గ్రామాల్లో శ్రమదానం, వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత, ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలు నిర్వహణ, ర్యాలీలు, రైల్వే స్టేషన్, ముఖ్య కూడళ్లలో శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి కెవి రమణారెడ్డి, జెడ్పీ సిఇఒ వేంకటేశ్వరరావు, జెసి-2 సీతారామారావు, డిఆర్వో వెంకటరావు, ఎస్‌ఇ ఎన్‌వి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.