విజయనగరం

మండుటెండలో జగన్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తిరాజేరు, అక్టోబర్ 14: మండలంలో ఆదివారం ఉదయం 10గంటలకు కోమటిపల్లి గ్రామంలో ప్రారంభమైన ప్రజాసంకల్ప పాదయాత్ర మండుటెండలో కొనసాగింది. అప్పటికే అక్కడికి చేరుకున్న వందలాది మంది మహిళలను పలకరిస్తూ క్యూలైన్లో నిలుచున్న వారితలపై చేయివేసి దీవిస్తూ ముద్దులు పెడుతూ పాదయాత్ర చేశారు. అడుగడుగునా నినాదాలు, వినతులు చేయడంతో రెండుగంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దారిపొడవునా అభిమానులు కాబోయే సిఎం జగన్, అన్న రావాలి-జగన్ కావాలంటూ నినాదులు చేస్తూ జగన్‌తోపాటు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గరివిడి వికలాంగుల పాఠశాల ఉపాద్యాయులు ఎం.శ్రీనివాసరావు తమకు పాఠశాలకు చెందిన ఉపాద్యాయ ఉద్యోగులకు నాలుగేళ్ళకు నోటిఫికేషన్ విడుదల కాలేదని వినతి పత్రం అందజేశారు. మరడాం గ్రామస్తులు తమ గ్రామంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. తాడేందొరవలస గ్రామానికి చెందిన యాదవులు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడంలేదని, వైసీపీ వస్తే యాదవులకు రుణాలతోపాటు అధిక సంఖ్యలో యాదవులు ఉన్న తమ గ్రామానికి గొర్రెలను మేపేందుకు ప్రభుత్వం స్థలం కావాలని కోరారు. దారిపొడవునా బస్సుల్లో, కారుల్లో వారికి అభివాదం చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. తాడేంద్రవలస, పోరలి, మరడాం మీదుగా షికారుగంజి కూడలి వద్ద ఏర్పాటు చేసిన బసలో మధ్యాహ్నం 11.30గంటలకు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.30గంటలకు పాదయాత్ర ప్రారంభించి షికారుగంజి జంక్షన్ రోడ్డు, ఎస్.బూర్జివలస మీదుగా పాదయాత్ర సాగించారు. ఈ సందర్భంగా ఎస్.బూర్జివలస గ్రామంలో వందలాది మంది మహిళలు జగన్‌ను కలసి దీవెనలు అందుకున్నారు. అనంతరం చౌదంతివలస గ్రామం వద్ద మామిడితోట ఆవరణలో రాత్రి బసకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, ఎస్.కోట నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం జిల్లా వైసీపీ నాయకులు మజ్జిశ్రీనివాసరావు(చిన్నశ్రీను), మండల వైసీపీ అధ్యక్షుడు కడుబండి రమేష్‌నాయుడు, మాజీ జడ్పీటీసీ మంత్రి అప్పలనాయుడు పలుగ్రామాల మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు మాజీ ఎంపీపీ రౌతు రాజేశ్వరితోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి
బొండపల్లి, అక్టోబర్ 14: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కోరాడ కృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని రాచకిండాం గ్రామంలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినదానికంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి బండారు నారాయణరావు, మాజీ ఎంపీపీ బండారు కృష్ణమూర్తి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ-పంట నమోదు పూర్తిచేయాలి

గజపతినగరం, అక్టోబర్ 14: ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని త్వరతగతిన పూర్తిచేయాలని స్థానిక తహశీల్దార్ బి.శేషగిరిరావు ఆదేశించారు. ఆదివారం మండలంలో జరుగుతున్న ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని తహశీల్దార్ శేషగిరిరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిపంట నమోదు కార్యక్రమం పూర్తిదశకి చేరుకున్నప్పటికీ ఉద్యానవన పంటల సాగు నమోదు నెమ్మదిగా జరుగుతున్నదని తెలిపారు. గ్రామరెవెన్యూ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి వందశాతం నమోదు కార్యక్రమం చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో వి ఆర్వో తదితరులు పాల్గొన్నారు.