విజయనగరం

వైభవంగా అంకమాంబ తీర్థ మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృంగవరపుకోట, జనవరి 17: మండలంలోని మామిడిపల్లి గ్రామంలో అంకమాంబ తీర్థమహోత్సం గురువారం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే ఈపండగను ఈ ఏడాది కూడా పలు ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ముక్కకనుమరోజున ఆచరించే ఈ తీర్థానానికి ప్రతి ఏటా పలు ప్రాంతాల నుండి భక్తులు తరలిరావడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా తెల్లవారుజాము నుండి ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో మాజీ సర్పంచ్ గంగాభవానీ ఆధ్వర్యంలో రెండు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఆలయ సమీపంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు నిర్వహించి యడ్ల పందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

1994-95పూర్వ విద్యార్థుల కలయిక
శృంగవరపుకోట, జనవరి 17: మండలంలోని ధర్మవరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న 1994-95 సంవత్సరం పూర్వ విద్యార్థులు సంక్రాంతి పండగ సందర్భంగా గురువారం పాఠశాలలో పూర్వవిద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలో 1994-95సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థినీ, విద్యార్థులు తమకుటుంబ సమేతంగా కలుసుకుని పూర్వ స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. 1994-95 సంవత్సరం పాఠశాల సిబ్బందితోపాటు తీయించుకున్న ఫొటోలను ఫ్లెక్సీగా చేయించి పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరు వచ్చి వాటిపై సంతకాల కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఐస్క్రీమ్ బండి యజమాని అప్పారావును తీసుకువచ్చి వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేశారు. ధర్మవరం పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్న విద్యార్థులంతా తాము విద్యను అభ్యసించిన పాఠశాలకు 50కుర్చీలు బహూకరించారు. అనంతరం తాముచదువుకున్నపుడు ఉన్న ఉపాద్యాయులను సన్మానించి తమగురుభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత పాఠశాల ప్రధానోపాద్యాయురాలు బి.లక్ష్మితోపాటు పూర్వ విద్యార్థులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు ముగిసిన పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె
శృంగవరపుకోట, జనవరి 17: మేజరు పంచాయతీ శృంగవరపుకోటలో గత 13 రోజులుగా జీతాలు లేక సమ్మెను కొనసాగిస్తున్న పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె గురువారంతో ముగిసింది. ఆరు నెలలుగా జీతాలు లేక కాంట్రాక్ట్ పంచాయతీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్న విషయం విధితమే. ఎట్టకేలకు ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమ్మెను, గ్రామంలోని అపారిశుద్ధ్యాన్ని గుర్తించి కార్మికుల జీతాలను వారి అకౌంట్లలో వేయడంతో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు విధిగా పాల్గొన్నారు. గత 13రోజులుగా పట్టణంలో అధిక సంఖ్యలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహించకపోవడంతో గ్రామంలో అపారిశుద్ధ్యం ఎక్కువై ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె విరమించుకుని విధులు నిర్వహించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రజాసంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు
* సిపిఐ జిల్లాకార్యదర్శి ఒమ్మి రమణ విమర్శ
విజయనగరం (్ఫర్టు), జనవరి 17: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ విమర్శించారు. అన్నివర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అమర్‌భవన్‌లో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి ఉపయోగపడే విద్య, వైద్యం పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకం పట్ల తగిన శ్రద్ద చూపడంలేదని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిష్‌లు కూడా సమయానికి చెల్లించడం లేదని మండిపడ్డారు. హుదూద్ తుఫాన్ బాధితులకు ఇంతవరకు పక్కాగృహాలు నిర్మించలేదని చెప్పారు. తిత్లీ తుఫాన్ బాధితులకు కూడా సకాంలో సాయం చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్‌లో బకాయిలను వెంటనే చెల్లించి ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, అలమండ ఆనందరావుతదితరులు పాల్గొన్నారు.

రోహిత్ మృతికి కారకులను శిక్షించాలి
* డిహెచ్‌పిఎస్ ప్రధానకార్యదర్శి గోకా డిమాండ్
విజయనగరం (్ఫర్టు), జనవరి 17: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధత్మాక విద్యార్థి వేముల రోహిత్ మరణించి మూడేళ్లు గడిచినా నేటీ కారకులను శిక్షించకపోవడం దారుణమని దళిత హక్కుల పోరాటసమితి జిల్లాప్రధానకార్యదర్శి గోకా రమేష్‌బాబు అన్నారు. రోహిత్ మరణించి మూడేళ్లు గడిచిన సందర్భంగా పట్టణంలో ప్రజాగ్రంథాలయంలో గురువారం రోహిత్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీల పట్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తున్నాయని ఆరోపించారు. విజయనగరం జిల్లాఅభివృద్ధివేదిక అధ్యక్షుడు పి.షణ్ముఖరావుమాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురైన రోహిత్ రిలేనిరాహారదీక్షలు ప్రారంభించిన తర్వాత హత్యకు గురికావడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాగ్రంథాలయం జిల్లాకార్యదర్శి ఈఎస్‌ఎన్‌రాజు, రొంగలి పెంటయ్య, రెడ్డి వెంకటరమణ, డిహెచ్‌పిఎస్ నెల్లిమర్ల నియోజకవర్గ కన్వీనర్ శీర పెంచలయ్య, లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.