విజయనగరం

కన్నుల పండువగా కొటారుబిల్లి కనకదుర్గ జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, జనవరి 17: మహిమాన్విత కొటారుబిల్లి కనకదుర్గమాత తీర్థ మహోత్సవం గురువారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా నిర్వహించిన తీర్థమహోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిస్సా రాష్ట్రం నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జాతరకు ముస్తాబు చేసిన అమ్మవారి ఆలయంపైకి భక్తులు అరటిపళ్లు విసరి తమభక్తిప్రపత్తులు చాటుకున్నారు. ఈ ఏడాది భక్తులు అత్యధిక సంఖ్యలో తరలిరావడంతో దానికి అనుగుణంగా ఎస్సై సాగర్ కుమార్, సిబ్బంది పటిష్ట బందోబస్తును నిర్వహించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీర్థమహోత్సవం ప్రశాంతంగా నెలకొన్నది. భక్తుల రద్దీకారణంగా వాహనాల రాకపోకలకు పలు ఇబ్బందులు కలిగాయి. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. అమ్మవారి జాతరలో భాగంగా ఉదయం అమ్మవారికి ఉత్సవ నిర్వాహకులు వేమలి కుటుంబీకులు అమ్మవారికి తొలిపూజను నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక బార్కేడ్లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి భక్తులు గంటల తరబడి బార్కెడ్లలో బారులు తీరి నిలబడ్డారు. మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు బొత్స అప్పలనర్సయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక మొక్కుబడులు ఉన్న భక్తులు ఆలయం వద్ద అమ్మవారి ఆలయంలో తలనీలాలు సమర్పించుకున్నారు.

సమ్మెతో మూతపడ్డ మీ-సేవా కేంద్రాలు
* అవస్తలు పడుతున్న అర్జీదారులు
వేపాడ, జనవరి 17: సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అవడంతో రాష్ట్రంలోని మీ-సేవా కేంద్రాలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం నుండి మండలంలోని మీ-సేవా కేంద్రాలు మూతపడ్డాయి. మండలంలోని వేపాడ, వల్లంపూడి, బాణాది, బొద్దాం, జగ్గయ్యపేట, వావిలపాడు, సోంపురం, ఎన్టీఆర్ పురం, బల్లంకి, బి. ఆర్.పేట గ్రామాలలో గల మీ-సేవా కేంద్రాలన్నీ మూతపడడంతో అర్జీదారుల అవస్తలు వర్ణాతీతం. ప్రతి పనికి మీ-సేవతో ముడిపడి ఉండడం, తహశీల్దార్, పోలీస్ స్టేషన్, ఇతరిత్రా అర్జీలు అన్నీ స్థంభించిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి మీ-సేవ నిర్వాహకుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించి అర్జీదారుల ఇక్కట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.