విజయనగరం

బీసీల సంక్షేమానికి టిడిపి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జనవరి 23: టిడిపి హాయాంలోనే బీసీలకు అన్నివిధానాల న్యాయం జరిగిందని, బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని మాజీ కేంద్రమంత్రి, టిడిపి పోలిట్‌బ్యూరోసభ్యుడు, విజయనగరం ఎంపి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. పట్టణంలో ఆనందగజపతి ఆడిటోరియంలో బుధవారం జరిగిన ఉత్తరాంధ్ర బీసీ జయహో సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. ఎటువంటి గందరగోళానికి గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం టిడిపికి ఉందన్నారు. 43వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి 18నెలలు జైలు జీవితం గడిపిన నాయకుడు రాజన్నరాజ్యం తీసుకువస్తానని బీరాలు పలుకుతున్నారని వైకాపా అధినేత జగన్‌ను ఉద్ధేశించి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నా పదవులు ఒదలని వాళ్లు అన్యాయం గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇందుకు బిజెపి నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, పురంద్రేశ్వరి వంటివారే నిదర్శనమని అన్నారు. భావితరాలు బాగుండాలంటే స్వతంత్రభావాలు కలిగిన ప్రభుత్వం ఉండవలసిన అవసం ఉందని అశోక్‌గజపతిరాజు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి 640 అవార్డులు వచ్చాయని, ఇందులో 210 అవార్డులు మనల్ని తిడుతున్న కేంద్రప్రభుత్వ ఇచ్చిందంటే టిడిపి ప్రభుత్వ పనితీరు అర్థమవుతుందన్నారు. రాష్టభ్రూగర్భగనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుమాట్లాడుతూ ఎన్నికలకు సుమారు మూడునెలల సమయం మాత్రమే ఉందని, పార్టీ ప్రాధాన్యత ప్రకారం ముందుకు వెళ్లవలసిన కీలక సమయం ఆసన్నమైందన్నారు. బీసీ సామాజికవర్గంతో టిడిపికి ఎనలేని సంబంధం ఉందని చెప్పారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కొన్నికులాలను బీసీల జాబితా నుంచి తొలగించిందని, దీనిఫలితం మన ఉత్తరాంధ్రపై ఎంతో ఉందని, మన బీసీలు నష్టపోతున్నారని తెలిపారు. అటువంటి పార్టీతో ఇక్కడ ప్రతిపక్షనేత జగన్ మంతనాలు చేసి వారి మద్ధతుకోసం పాకులాలడటం సిగ్గుచేటు అన్నారు. బీసీలను అన్నివిధాలా ఆదుకునేందుకు కృషి చేస్తున్న టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావలసిన అవసరం ఉందని చెప్పారు. కాపుకార్పోరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకబడిన కులాల అభివృద్ధికి, సంక్షేమానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షపార్టీ హామీలు కొండను తెచ్చి మన నెత్తిన పెట్టేవిధంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మనం ఏమాత్రం పొరపాటుచేసినా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మన యోగక్షేమాలు చూసే ప్రభుత్వానికి మద్థతు తెలుపుతూ తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేలా, టిడిపి అధికారంలోకి వచ్చేలా బీసీలంతా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్‌పర్సన్ డాక్టర్ స్వాతి శోభారాణి, విజయనగరం, నెల్లిమర్ల, ఎస్.కోట, గజపతినగరం, చీపురుపల్లి, పార్వతీపురం ఎమ్మెల్యేలు మీసాల గీత, పతివాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారి, డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు, డాక్టర్ కిమిడి మృణాళిని, బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సే ద్వారపురెడ్డి జగదీష్, అత్యంత వెనుకబడిన తరగతుల సంస్థ చైర్మన్ కాకి గోవిందరెడ్డి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల టిడిపి అధ్యక్షులు మహంతి చిన్నంనాయుడు, గౌత శీరీష తదితరులు పాల్గొన్నారు.