విజయనగరం

రహదారి భద్రత ప్రాథమిక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 14: రహదారి భద్రత ప్రాధమిక బాధ్యత అని ఆర్టీసీ డిపోమేనేజర్ ఎన్.బాపిరాజు అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఎలయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-105, ఎపిఎస్‌ఆర్టీసీ సంయుక్తంగా పట్టణంలో కొత్త అగ్రహారంలోని ఉమాభారతి డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రహదారి భద్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు. అతివేగం, నిద్రలేమి, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్‌టేకింగ్ ప్రమాదాలకు కారణమని తెలిపారు. ద్విక్రవాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలను నడపరాదని, రోడ్డు దాటేప్పుడు కుక్కలు, పందులు, గేదెలు, ఆవులు వంటి జంతువులు అడ్డుగా వచ్చే ప్రమాదం ఉన్నందున సాధ్యమైనంతవరకు నెమ్మదిగా వాహనాలను నడపాలన్నారు. లోక్‌సత్తా పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ సురక్షితం లేని వాహనాల్లో ప్రయాణించరాదన్నారు. వాహనాలపై వేలాడుతూ ప్రయాణం చేయరాదని, మితిమీరిన లోడుతో గల వాహనాల్లో ప్రయాణం చేయవద్దని సూచించారు. ఈ సదస్సులో క్లబ్ గవర్నర్ సముద్రాల గురుప్రసాద్, వనితాక్లబ్ అధ్యక్షురాలు సుభ్రదానదేవి, కళాశాల కరస్పాండెంట్ బిఎ రావు, ప్రిన్సిపాల్ అనిల్, కామర్స్ విభాగం అధిపతి ఉమామహేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.
ఎన్‌టిఆర్ గృహాలను అర్హులకు ఇవ్వాలని ధర్నా
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 14: పట్టణంలో అర్హులైన నారుూబ్రాహ్మణులకు ఎన్‌టిఆర్ గృహాలను మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ నారుూబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టివి దుర్గారావుకోరారు. ఈమేరకు గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా దుర్గారావుమాట్లాడుతూ అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్న నారుూబ్రాహ్మణ కుటుంబాలకు ఎన్‌టిఆర్ గృహాలు ఇవ్వాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గతంలో అధికారులు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పట్టణంలో నారుూబ్రాహ్మణులకు ఇళ్లను అద్దెకు ఇచ్చే పరిస్థితులు లేవని, ఎవరైనా కుటుంబంలో వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ శవాన్ని ఇంటికి తీసుకురానీయకుండా శ్మశానికి తీసుకువెళ్లాలని ఇంటియజమానులు చెబుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నారుూబ్రాహ్మణుల బాధలను స్ధానిక మండల తహాశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి మున్సిపల్‌కమిషనర్‌కు ఒక లేఖ ద్వారా సర్వేనెంబర్ 22/2, 229లో విజయనగరం బిట్-2లో జి ప్లస్ 2 ఇళ్ల కోసం ప్రభుత్వం చదును చేసిన స్థలంలో ఇళ్లను కేటాయించాలని తెలియజేశారని, అయితే మున్సిపల్ అధికారులు స్పందించడంలేదని దుర్గారావుఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధివేదిక అధ్యక్షుడు పి.షణ్ముఖరావు, సామాజిక పోరాటవేదిక జిల్లా కార్యదర్శి రాకోటి గోపాలరావు, నారుూబ్రాహ్మణ సంఘం నాయకులు ముచ్చిపిల్లి రమణభాస్కరరావు, చింతపల్లి సూర్యనారాయణ, బెల్లాపుబాబ్జీ, రామేశ్వరపుదేవి, రామేశ్వరపునాగమణి తదితరులు పాల్గొన్నారు.
శతకోటి ప్రజాగళం ర్యాలీ
గజపతినగరం, ఫిబ్రవరి 14: జిన్నాం గ్రామంలో గురువారం ఆంధ్రప్రదేశ్ మహిళా సమతాసొసైటీ నిర్వహకులు విద్య పర్యవేక్షణలో శతకోటి ప్రజాగళం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళలపై దాడులు పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లలు పుడుతున్నారన్న కారణంగా భృహణ హత్యలకు పాల్పడుతున్నందున మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. మహళలపై జరుగుత్ను హింసను ధైర్యంగా ఎదుర్కొవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిలారి అప్పలనాయుడు, హెచ్‌ఎం తదితరులు పాల్గొన్నారు.