విజయనగరం

జాతీయ సేవా పధకం సేవలు సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఫిబ్రవరి 18: జాతీయ సేవా పధకం ద్వారా చేపట్టనున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మిమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ షంషేర్ బేగం కోరారు. సోమవారం మండలంలోని ముచ్చెర్ల గ్రామంలో వారం రోజులపాటు నిర్వహించనున్న ఎన్ ఎస్ ఎస్ సేవా శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 21వరకు గ్రామంలో సేవా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. గ్రామంలో ప్రతి గ్రామస్ధుడికి వైద్య పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. మండలంలోని ముచ్చెర్ల గ్రామంలో నెల్లిమర్ల మిమ్స్ నర్సింగ్ కళాశాల విద్యార్ధులు తరపున ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ గ్రామంలో మిమ్స్ కళాశాలకు చెందిన వారు శిభిరాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ప్రజలు వారికి సహకరించి ఈ శిబిరం విజయవంతం కావడానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గార అప్పలస్వామి, ఎంపీటీసీ కరుమజ్జి కృష్ణ, మాజీ సర్పంచ్ గారపెంటయ్య, మిమ్స్ వెల్ఫేర్ ఆఫీసర్ గిరిబాబు, అద్యాపకులు వసంత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

ఫ్రకృతి వ్యవసాయమే భవిష్యత్ ఆహారం
కొత్తవలస, ఫిబ్రవరి 18: ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలే భవిష్యత్‌లో ఆహారంగా ప్రజలు తీసుకోవాల్సి ఉంటుందని సభాల సంస్థ కార్యదర్శి కె. సరస్వతి తెలిపారు. సోమవారం గొల్లపాలెంలో నిర్వహించిన మహిళల సమావేశంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. 2019 ఖరీఫ్‌లో ప్రకృతి వ్యవసాయంతోనే పంటలు పండించాలని, ఈ పద్ధతిలో పండించే పంటలు అధిక దిగుబడులు సాధిస్తాయని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను సేంద్రీయ ఎరువులతో పండించే పంటలు మాత్రమే తట్టుకోగలవని ఆమె తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా జీవామృతం, బీజామృతం, అచ్చాదనం, వార్తా వంటి పద్ధతుల్లో పండించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఆర్‌పి రమాదేవి, గోవిందరావు, సబలా కో- ఆర్డినేటర్ కె. ఈశ్వరరావు, సిటిఎ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

అనాధ శవానికి అంత్య క్రియలు
గజపతినగరం, ఫిబ్రవరి 18: అనాధ శవానికి సత్యసాయి భక్తులు అంత్య క్రియలు జరిపిన సంఘటన గజపతినగరంలో చోటుచేసుకుంది. గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మృతిచెంది ఉన్న అనాధ శవాన్ని గజపతినగరం సత్యసాయి సేవా సమితి వారు గుర్తించారు. ఈ మేరకు సత్యసాయిసేవా సమితి కన్వీనర్ వెంకటేష్ పర్యవేక్షణలో సత్యసాయిభక్తులు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు జరిపారు. సామాజిక కార్యక్రమంలో సత్యసాయి భక్తులు పాల్గొంటున్నందుకు పలువురు అభినందించారు.

చంద్రబాబును ప్రజలు నమ్మరు
* నాఫెడ్ డైరెక్టర్ కె. వి.సూర్యనారాయణరాజు
గుర్ల, ఫిబ్రవరి 18: ఎన్నికల ముందు ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు నమ్మరని నాఫెడ్ డైరెక్టర్ కె.వి.సూర్యనారాయణరాజు అన్నారు. పల్లిగండ్రేడు గ్రామంలో సోమవారం రావాలి జగన్- కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. గ్రామాలలో నాయకులంతా పర్యటించి నవరత్నాల పథకాలపై ప్రజలకు వివరించారు. నిన్ను నమ్మంబాబు అంటూ చంద్రబాబునాయుడు రాష్ట్రానికి చేసిన మోసాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మండల వైసీపీ అధ్యక్షుడు శీర అప్పలనాయుడు మాట్లాడుతూ గత నాలుగేళ్ళల్లో ప్రజలు చంద్రబాబునాయుడుకు గుర్తు రాలేదని, ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఓట్లు రాజకీయం చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల వారికి అందుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెట్టంగి సొసైటీ అధ్యక్షుడు రవిబాబు, ఎంపీటీసీ మధుసూధనరావు, మాజీ సర్పంచ్ జమ్ము సోమునాయుడు, యడ్ల కృష్ణ తదితర నేతలు పాల్గొన్నారు.

వ్యవసాయ ఉత్పాదకతను రైతులు మెరుగు పర్చుకోవాలి
* జడ్పీటీసీ తిరుమలరాజు పద్మిని
గుర్ల,్ఫబ్రవరి 18: వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను మెరుగు పరచుకోవడం లాభదాయకమని జడ్పీటీసీ పద్మిని అన్నారు. సోమవారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ సంయుక్త సంచాలకు విజయనగరం సౌజన్యంతో, ఐఆర్‌పి డబ్ల్యుఎ సంస్థ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారిణి ఎం. అనురాధ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమీకృత, సాగునీరు, వ్యవసాయం పరివర్తన పథకం ద్వారా వల్డ్ బ్యాంకు ఆర్థిక సహాయంతో 1600కోట్లుతో 12జిల్లాల్లో పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈపథకం ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని ఆమె తెలిపారు. వ్యవసాయ శాఖ, జలవనరుల శాఖ, మత్స్య శాఖ, రెవెన్యూ శాఖ అనుసంధానంతో విజయనగరం జిల్లాలో 102 చెరువులను అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఈప్రాజెక్టు వలన ఎంపిక చేయబడిన చెరువుల్లో వాతావరణ వైవిద్యాలను ఎదుర్కొనే శక్తిని రైతులకు స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు. ప్రాజెక్టు ద్వారా సాగునీటి వ్యవసాయం యొక్క సమర్థత పెంపుదల, అనుకూల సుస్థిర వ్యవసాయం సిద్ధమవడం, అగ్రిబిజినెస్,మార్కెటింగ్, అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారని అన్నారు. వ్యవసాయ అధికారిణి అనురాధ మాట్లాడుతూ గుర్ల, కెల్ల నీటి సంఘాలైన గ్రామాలలో ఈ ప్రాజెక్టు చెరువులను అభివృద్ధిచేసి ఆయకట్టు రైతులకు అనుకూలమైన పంటలు పండించుకునే విధానంపై అవగాహన కల్పించి తద్వారా అభివృద్ధి చెందే విధంగా రైతులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎడి వేణుగోపాలరావు, డిడి కె. సత్యనారాయణ, ఇరిగేషన్ ఎఇ ప్రకాశరావు, ఎపిడి రామారావు, ఎఐడి వీరాస్వామి, వ్యవసాయ శాఖ సిబ్బంది గిరి, కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.

గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురం, ఫిబ్రవరి 18: గిరిజన ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పార్వతీపురం ఐటిడి ఎ పీవో డాక్టర్ జి.లక్ష్మీశ నిర్వహించిన గ్రీవెన్సులో పలు ప్రాంతాల నుండి వచ్చిన గిరిజనులు పీవోకు వినతులు స్వీకరించారు. సాలూరు మండలంలోని కొయ్యానవలస, మక్కువ మండలంలోని తాటిపూడి గిరిజనులు 25 ఎకరాల భూమిలో తుప్పలు,డొంకలు తొలగించి సాగులోకి తెచ్చిన తరువాత అటవీశాఖ తమనుండి స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సవర భాష విద్యావాలంటీర్ల సంక్షేమ సంఘం వాలంటీర్లకు నియామకపత్రాలు ఇవ్వాలని పీవోను కోరారు. జియ్యమ్మవలస మండలంలోని అలమండ,టికెజమ్ము, పిటిమండ, కొండచిలకాం, పంచాయతీలలోని గిరిజన గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. కురుపాం మండలంలోని నాగరగూడకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామ గిరిజనులు కోరారు. కొమరాడ మండలంలోని కుంతేసు గిరిజనులు గ్రామంలోని చెరువులు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ గ్రీవెన్సుకు పలువురు సెక్టారల్ అధికారులు పాల్గొన్నారు. అలాగే పలు గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనులు తమకు సాగునీరు,తాగునీరు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించాలని కోరారు.

భూ సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురం, ఫిబ్రవరి 18: భూమి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పార్వతీపురం సబ్ కలెక్టర్ టి ఎస్ చేతన్ నిర్వహించిన గ్రీవెన్సులో పలువురు వినతులు సమర్పించారు. ఈసందర్భంగా పార్వతీపురం మండలంలోని సగంవలస గ్రామానికి చెందిన భూమి సమస్య పరిష్కరించాలని ఆగ్రామ నివాసి కోరారు. అలాగే జియ్యమ్మవలస మండలంలోని చంద్రశేఖరాజపురం వాసులు తమకు పట్టాదారుపాసులు, టైటిల్ డీడ్లు ఇప్పించాలని కోరారు. గరుగుబిల్లి మండలంలోని మధురా దత్తివలసకు చెందిన ప్రజలు తాము సాగుచేస్తున్న భూములకు డి పట్టాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తప్పవు
బొబ్బిలి, ఫిబ్రవరి 18: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలపై మరింత పటిష్టవంతమైన నిఘా పెంచామని, ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతిభద్రతకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ మోహనరావు హెచ్చరించారు. సోమవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎటువంటి ఘర్షణలు, గొడవులకు తావులేదన్నారు. ఈమేరకు ముందుగా బైండోవర్ కేసులు నమోదుచేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే ఎవరు ఎటువంటి చర్యలకు పాల్పడిన వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. మారుమూల గ్రామాల్లో సైతం అవగాహన కల్పించడంతోపాటు మరింత పటిష్టవంతమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికల్లో ప్రజల సహకారం తప్పనిసరి
సీతానగరం, ఫిబ్రవరి 18: వచ్చే ఎన్నికల్లో ప్రతీ గ్రామంలోను ప్రజల సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే అవకాశం ఉందని ఎస్‌ఐ కృష్ణమూర్తి అన్నారు. మండలంలోని నిడగల్లు గ్రామంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌శాఖ ఇంతవరకు నిర్వహించిన వివిధ గ్రామసభలలో ఎన్నికలకు సంబంధించి వివిధ సూచనలు అందిస్తుందన్నారు. ఏ కార్యక్రమమైన ప్రజల సహకారంతోనే ప్రశాంతంగా ముగుస్తుందన్నారు. ప్రజలు, పోలీసుల మధ్య స్నేహభావం ఉంటేనే శాంతిభద్రతలకు ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు. ఎక్కడైన అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

గ్రామాలలో బూత్ లెవెల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
దత్తిరాజేరు, ఫిబ్రవరి 18: గ్రామాలలో బూత్ లెవెల్ అధికారులు అప్రమత్తంగా ఉండి రానున్న ఎన్నికల దృష్ట్యా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ నైట్యాంగిల్ అన్నారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన బి ఎల్‌వొల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాల్లో చేర్పిలు, మార్పులు గుర్తించి ఎటువంటి పొరపాట్లు జరగకుండా కొత్తగా ఓటు కావాల్సిన వారికి ఆన్‌లైన్‌లో చేర్పించేందుకు కృషి చేయాలని అన్నారు. రానున్న ఎన్నికలు సందర్భంగా జిల్లాకు చెందిన ఎన్నికల అధికారులు గ్రామాలలో పర్యటించేటపుడు వారికి కావాల్సిన సమాచారం సక్రమంగా అందించేందుకు బి ఎల్‌వొలు కృషి చేయాలని ఆదేశించారు. గ్రామాలలో ఎటువంటి సమస్యలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజల్లో ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ తేజేశ్వరరావు, డిటి కోటీశ్వరరావు, బిఎల్‌వొలు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలి
బొండపల్లి, ఫిబ్రవరి 18: ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ప్రజలు సహకరించాలని స్థానిక ఎస్సై సాగిరాజు కృష్ణవర్మ కోరారు. సోమవారం మండలంలోని గొల్లుపాలెం, రరుూంద్రం గ్రామాలలో ఎన్నికల నిర్వహణపై ప్రజలకు అవగాహన సదస్సు ద్వారా ఎస్సై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పల్లెల్లో ప్రజలు శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి సహకరించాలని అన్నారు. వర్గాలుగా ఏర్పడి దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏమైనా సందేహాలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. అదే విధంగా ఆయా గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను ఎస్సై కృష్ణవర్మ ఆకస్మిక తనిఖీలు చేసి కేంద్రాల్లో సదుపాయల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.