విజయనగరం

పోలింగ్ కేంద్రాలలో పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పనకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరుగుబిల్లి, మార్చి 12: పోలింగ్ కేంద్రాలలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని సెక్టార్ అధికారి బొంగు తిరుపతిరావు అన్నారు. మండల పరిధిలోని సంతోషపురం, చిలకాం, పిట్టలమెట్టలస, ఖడ్గవలస, తదితర గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, తాగునీరు, తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలలో ర్యాంప్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

పోషణ్ అభియాన్‌లో భాగంగా పలు కార్యక్రమాలు
గరుగుబిల్లి, మార్చి 12: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గరుగుబిల్లి అంగన్వాడీ కేంద్రాలలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు పోషణ్ అభియాన్‌పై క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా గరుగుబిల్లి-1,2 అంగన్వాడీ కార్యకర్తలు పద్మావతి, కృష్ణవేణిలు మాట్లాడుతూ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహారంపై గ్రామంలో గర్భిణీలు, బాలింతలకు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా కిశోరబాలికలు, విద్యార్థులు పౌష్టికాహారాన్ని తీసుకుంటే రక్తహీనత, తదితర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని అవగాహన కల్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

గాదెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
గరుగుబిల్లి, మార్చి 12: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడును అధిక మెజార్టీతో గెలిపించాలని ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిమిత్తం గరుగుబిల్లి ఉన్నత పాఠశాలతోపాటు ఉల్లిభద్ర, నాగూరు, రావివలస, తోటపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్, కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం, తదితర ప్రధాన సమస్యల పరిష్కారానికి గాదె కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కె రాములు, పీఆర్‌టీయు మండల నాయకులు బొత్స రవికమార్, తదితరులు పాల్గొన్నారు.
రఘువర్మరాజును ఎమ్మెల్సీగా గెలిపించాలి
గజపతినగరం, మార్చి 12: ఉపాద్యాయ శాసన మండలి అభ్యర్థిగా పోటీ చేయుచున్న పాకలపాటి రఘువర్మరాజుకు ఉపాద్యాయ ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని యూటి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.శేషగిరి కోరారు. మంగళవారం మెంటాడ, జయతి, చల్లపేట హైస్కూళ్ళల్లో జిల్లా మండల యూటిఎఫ్ నాయకులు ఆయనకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో మాట్లాడుతూ ఉపాద్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సిపిఎస్ రద్దు, ఇతర సమస్యల పరిష్కారానికి రఘువర్మరాజు కృషి చేయడం జరుగుతుందని, బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలపై శాసన మండలి సమావేశాల్లో పోరాటం సాగించడం జరుగుతుందని తెలిపారు. ఇటువంటి అభ్యర్థిని గెలిపించడం మన కర్తవ్యమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మండల యుటిఎఫ్ నాయకులు పంట్ల లక్ష్మణ, ముగడ ప్రభాకాచారి, మండల శ్రీనివాసరావు, చింతా రవికుమార్,ప్రధానోపాద్యాయులు గౌరీశంకరరావు, పలువురు ఉపాద్యాయులు పాల్గొన్నారు.
రెండవ రోజుకు చేరిన నిరాహార దీక్ష
గరుగుబిల్లి, మార్చి 12: తోటపల్లి ఎడమ కాలువలో కాంక్రీట్ పనులకు వ్యతిరేకంగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈమేరకు మంగళవారం రిలే నిరాహార దీక్షలో సంతోషపురం, ఖడ్గవలస గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ఈసందర్భంగా తోటపల్లి ఎడమ కాలువ పరిరక్షణ కమిటీ నాయకులు డొల్లు పారినాయుడు, సీపీఎం మండల కార్యదర్శి బివి రమణలు మాట్లాడుతూ తాము చేస్తున్న ఆందోళన న్యాయబద్ధమైనదని, ఈ కాంక్రీట్ నిర్మాణం వలన పలు గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పవన్నారు. గత రెండు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షలకు అధికారులలో కొంత చలనం వచ్చిందని, అయితే పూర్తిస్థాయిలో కాంక్రీట్ నిర్మాణాలను నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చేంతవరకు ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతులు భూములను అందించారని, అటువంటి రైతుల పట్ల ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. కాలువ అడుగు భాగంలో కాంక్రీట్ నిర్మాణంతోపాటు ప్రత్యేకంగా రాతిలో రివిట్‌మెంట్ పనులను చేపట్టాలని, అలా చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు, చంద్రశేఖర్, ఉమామహేష్, తదితరులు పాల్గొన్నారు.

గిజబ గ్రామసమీపంలో గజరాజుల సంచారం
గరుగుబిల్లి, మార్చి 12: మండల పరిధిలోని గిజబ గ్రామ సమీపంలో మంగళవారం గజరాజులు సంచరిస్తున్నాయి. ఈమేరకు గిజబ గ్రామసమీపంలోని తోటపల్లి ప్రాజెక్టు లోపల నాగావళి నదిలోకి చేరుకున్నాయి. ఇంతవరకు కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో సంచరించిన ఏనుగులు మంగళవారం నాటికి గిజబ గ్రామ సమీపంలోకి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గజరాజులు సంచరిస్తున్న ప్రాంతాలను రెవెన్యూ అధికారులు పరిశీలించారు.