విజయనగరం

‘నాని ఎంతపని చేసావురా’ ట్రైలర్ పోస్టర్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (పూల్‌బాగ్)మే 26: ప్రసాద్ సినిమా టీం ప్రొడక్షన్ పేరిట నిర్మిస్తున్న ‘నాని ఎంతపని చేసావురా’సినిమా ద్వారా ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహిస్తామని ఆచిత్ర దర్శకనిర్మాత ప్రసాద్ అన్నారు.గురువారం తన కార్యాలయంలో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రసాద్ మాట్లాడుతు కేవలం నటీనటులను మాత్రమే కాకుండా సాంకేతిక నిపుణులను కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు.పట్టణంలోని గురజాడ అప్పారావు రోడ్డులోసంస్ధ కార్యాలయంలో కళాకారులను ఎంపిక చేస్తామన్నారు. విజయనగరం పరిసర ప్రాంతాల్లో చిత్రం షూటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో చిత్రహీరో జగదీష్, బహుదూర్, వినోద్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు.