విజయనగరం

చంపావతిలో చెక్ డ్యామ్‌ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మే 30: చంపావతి నదిలో నాలుగుచోట్ల చెక్ డ్యామ్‌లు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధంచేసామని సాగునీటి పారుదల శాఖ డి ఇ ఎ.సి.హెచ్. అప్పలనాయుడు చెప్పారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పిట్టాడ గ్రామం నుండి ఆండ్ర రిజర్వాయరు వరకు నాలుగుచోట్ల ఒక్కొక్క చెక్ డ్యాం నిర్మాణానికి మూడు నుంచి ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తామని తెలిపారు. ఆండ్ర రిజర్వాయర్ కుడికాలువలు పూడికతీతకోసం 20లక్షల నిధులు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు చేపడతామని తెలిపారు. ఈనెలాఖరునాటికి తాటిపూడి రిజర్వాయరు ఆధునీకరణ పను లు పూర్తి అవుతాయని చెప్పారు. 23కోట్ల రెండు లక్షల రూపాయలతో పనులు చేపట్టాలని నిర్ణయించగా 24 కోట్ల రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసామని తెలిపారు. బి.వి.్ఛనల్ ఆధునీకరణకు సంబంధించి కోటి 20లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసామని చెప్పారు.