విజయనగరం

కనీస వేతన సాధనకు సిఐటియు పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్),మే 30: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, అసంఘటితరంగ కార్మికుల కనీస వేతనాలకోసం పోరాడాలని ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ శర్మ చెప్పారు. పట్టణంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో రెండురోజులు జరిగిన సి ఐటియు ఎనిమిదవ జిల్లా మహాసభలు సోమవారం ముగిసాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఈ సదస్సులో పాల్గొన్న సి ఐటియు రాష్ట్ర నాయకులు పుణ్యవతి, సి.హెచ్. నర్సింగరావు ఎండగట్టారు. అదేవిధంగా ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే అహామీలు అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. మంచిరోజులు వస్తాయని నమ్మబలికిన ప్రధాని మోడి ప్రభుత్వం కూడా ఈ రెండేళ్లల్లో కార్మిక వర్గానికి చేసింది శూన్యమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే విధంగా బలమైన ఉద్యమం నిర్మించాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల సమావేశాలలో కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం తేవాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, మూతపడిన పరిశ్రమలు తెరిపించాలని తీర్మానించారు. నూతన కార్యవర్గం 18మందితో ఏర్పాటు అయింది. జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా ఎం. శ్రీనివాస, ప్రధాన కార్యదర్శిగా పి.వి.రమణ ఎన్నికయ్యారు.