విజయనగరం

వాడివేడిగా మండల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, మే 30: మండల పరిషత్ సాధారణ సమావేశం సోమవారం వాడీవేడిగా జరిగింది. ఎంపిపి పొలమర శెట్టి శాంతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు, సభ్యులమధ్య వాగ్వాదం జరిగింది. ఎక్సైజ్‌శాఖ, పంచాయితీరాజ్ శాఖ, ఆర్‌డబ్ల్యు ఎస్ శాఖల అధికారులను సభ్యులు నిలదీసారు. మండలంలో మద్యం ధరలకు అదుపులేకుండా పోతుందని, ఎం ఆర్‌పి కంటే 15రూపాయల నుండి 20 రూపాయల వరకు ఎక్కువకు అమ్ముతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదని సభ్యుడు మేస్ర్తి అప్పారావు నిలదీశారు. ఎక్సైజ్ శాఖ సిఐ గత మూడు సమావేశాలకు హాజరు కాలేదని మండిపడ్డారు. బెల్టుషాపులను నియంత్రించలేదని, నాటుసారా ఏరులైపారుతున్నా చర్యలు చేపట్టలేదని, అప్పారావు ప్రశ్నించారు. వీటిపై చర్యలు తీసుకోకపోతే పై అధికారులను సంప్రదిస్తామని చెప్పారు. మేజర్ పంచాయితీ నిధులు ఖర్చులో అవకతవకలు జరిగాయని, అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరించారని మరో సభ్యు డు యల్లపుసూరిబాబు ఎంపిడి ఓను నిలదీసారు. మండలానికి వచ్చిన ఐదు కోట్ల నిధులు, పంచాయితీకి వచ్చిన మూడు కోట్ల నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘ నిధులు 30లక్షలు మేజరు పంచాయితీలో ఉన్నాయని, 58 లక్షలు మండల పరిషత్ లో ఉన్నాయని ఈఓపిఆర్‌డి నీలం అప్పలనాయుడు సమాధానం ఇచ్చారు. మిగతా నిధులు ఖర్చు గురించి తమకు తెలియదనడం సభ్యులను ఆశ్చర్య పరచింది. అదేవిధంగా మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. శిథిలమైన పాఠశాల భవానాలు తొలగించేందుకు అనుమతులు వచ్చాయని ఎంఇఓ తెలిపారు. కొంత మంది అధికారులను వైస్ ఎంపిపి రాజన్న వెనకేసుకు వస్తున్నారని సభ్యుడు సూరిబాబు ఆరోపించారు. హుదూద్ నిధు లు ఖర్చుచేయకపోవడంతో నిధులు పక్కజిల్లాలకు మళ్లాయని సభ్యుడుమేళాస్ర్తీ అప్పారావు అన్నారు. సంక్షేమ పథకాలు సకాలంలో పూర్తిచేయాలని సభ్యు లు సూచించారు. ఈసమావేశంలో జడ్పీటిసి రమణమ్మ అధికారులు పాల్గొన్నారు.