విజయనగరం

యుద్ధ ప్రాతిపదికన ఎన్టీఆర్ జలసిరి పనులు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మే 30: ఎన్టీ ఆర్ జలసిరి కింద మంజూ రు చేసిన బోరుబావులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీ ఆర్ జలసిరి పనులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం కింద జిల్లాలో అందిన 15వేల దరఖాస్తులు పరిశీలించి వెంటనే మంజూరు చేయాలని జూలై 15 నాటికి రెండువేల బోరుబావుల నిర్మా ణం పూర్తిచేయాలని డ్వామా పిడి ప్రశాంతికి కలెక్టర్ ఆదేశించారు. బోరుబావుల తవ్వకానికి అనువైన ప్రాంతాలను జియాలజిస్టుల సహకారం తీసుకోమని చెప్పారు. ఇప్పటి వరకు 400 బోరుబావుల డ్రిల్లింగ్ పూర్తిచేసామని వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సౌక ర్యం కల్పించాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఇ చిరంజీవిరావుకు ఆదేశించారు. బోరుబావులు తవ్వుకునే రిగ్‌లు రైతులు సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలని చె ప్పారు. రోజు 40 బోర్లు వరకు నిర్మించాలని అన్నా రు. సోలార్ పంపుసెట్ల ఏర్పాటులో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని చెప్పారు. వ్యవసాయ క్షేత్రాలలో తవ్విన పంట కుంటలకు మెట్లు ఏర్పాటుచేసి ప్రమాదాలు నివారించాలని సూచించారు. ఈసమావేశంలో డిపి ఓ సత్యనారాయణరాజు, వ్యవసాయశాఖ జెడి లీలావతి, మైక్రో ఇరిగేషన్ పిడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.