విజయనగరం

సద్దుమణిగిన మహాకవి గురజాడ వారసుల స్థల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), మే 30: పట్టణంలో మహాకవి గురజాడ అప్పారావువారసులకు మున్సిపల్ స్థలాన్ని కేటాయించేందుకు మున్సిపల్ పాలకవర్గం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు గురజాడ వారసులకు స్థలాన్ని కేటాయిస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ సోమవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. గురజాడ వారసులకు స్థల కేటాయింపులో చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో పలు రాజకీయపార్టీలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సాహితీసంస్థలు పెద్దఎత్తున నిరసన తెలియజేశాయి. ఈ పరిణామాల నేపధ్యంలో మున్సిపాలిటీ పరిధిలో టౌన్‌సర్వేనెంబర్ 14లో సంతపేట సౌత్‌వార్డులో 45 సెంట్లు భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్థల కేటాయింపునకు సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ప్రిన్సిపాల్ సెక్రటరీ సంబంధిత ప్రతిపాదనలను జిల్లా యంత్రాంగానికి పంపారు. ఈ మేరకు మే 9వతేదీన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం అజెండాలో 40వ అంశంగా పొందుపర్చారు. దీనిపై చర్చించిన కౌన్సిల్ సభ్యులు ఈ అంశాన్ని తిరస్కరించారు. దీంతో సాహితీవేత్తలు, స్వచ్చంద సంస్ధలు, రాజకీయపార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికితోడు గురజాడ స్వగృహాన్ని మ్యుజియంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వమే స్వయంగా ప్రకటించడంతో మున్సిపల్ పాలకవర్గం ఇరకాటంలో పడింది. గురజాడ స్ధల కేటాయింపు అంశాన్ని మున్సిపల్ పాలకవర్గం తిరస్కరించడంతో సాహితీవేత్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో గురజాడ వారసులకు స్థలాన్ని కేటాయిస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. సోమవారం తన ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించడమేకాకుండా గురజాడ స్వగృహాన్ని మ్యుజియంగా తీరిద్దిద్దే విషయంలో పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. అయితే గురజాడ వారసులకు మున్సిపల్ స్థలాన్ని కేటాయించేందుకు అంగీకరించినందుకు మున్సిపల్ చైర్మన్ రామకృష్ణకు పలువురు సాహితీవేత్తలు అభినందించారు.
గురజాడ స్వగృహాన్ని మ్యుజియంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా గురజాడ ఇంటిని ఆనుకుని ఉన్న గురజాడ వారసులకు వేరొక చోట స్థలాన్ని కేటాయించేందుకు అంగీకరించడం మంచి పరిణామమని ప్రముఖ సాహితీవేత్తలు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గొల్లపూడి మారుతీరావుఅన్నారు. ఈ మేరకు గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్, మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ సైలాడ త్రినాధరావు పాల్గొన్నారు.