విజయనగరం

ఆర్‌ఆర్ ప్యాకేజీ కోసం ఉద్యమబాట పట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, మే 30: సారిపల్లి గ్రామపంచాయితీకి ఆర్ ఆర్ ప్యాకేజీ కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమబాట పట్టాలని సిపి ఎం కేంద్రకమిటీ సభ్యులు ఎస్. పుణ్యవతి అన్నారు. సారిపల్లి గ్రామం వద్ద నిర్మాణం చేపడుతున్న తారకరామ రక్షణగట్టును సోమవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె నిర్వాసితులతో మాట్లాడుతూ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే ఒక పక్క ప్రాజెక్టులు మరో పక్క చంపావతి నది మధ్యలో ఈ గ్రామస్తులు మగ్గిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేసారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు గ్రామస్తుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని అన్నారు.రిజర్వాయర్ నిర్మాణానికి గ్రామస్తుల మొత్తం భూమిని ఇచ్చారని గుర్తు చేసారు. ప్రస్తుతం రైతుల బతుకుతెరువు పోయిందని అన్నారు. భూములిచ్చిన రైతులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని చెప్పారు. అలాగే గ్రామంలో ఉన్న వృత్తిదారులు చాకలి, మంగళి, గొర్రెల పెంపకం దారులు, ఉపాధి కోల్పోయారని అన్నారు. వీరందరినీ ఆదుకోవాలంటే ప్రభుత్వం గ్రామానికి పునరావాస ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేసారు. రైతులను కంటతడి పెట్టించి ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామాన్ని నీటిపారుదలశాఖ మంత్రి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సందర్శించారే తప్పా నిర్వాసితుల సమస్యలపై స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే సారిపల్లి గ్రామ పంచాయితీ ఆర్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపి ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎ.జగన్మోహన్, నిర్వాసితులు నడిపేన ఆనంద్, కిలారి సూర్యనారాయణ, ఎన్. లక్ష్మణరావు పాల్గొన్నారు.