విజయనగరం

చీడివలసలో వైద్యశిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, జూన్ 2: మండలంలోని చీడివలస గ్రామంలో గురువారం వియ్యంపేట పిహెచ్‌సి వైద్యాధికారులు వైద్య శిబిరం నిర్వహించారు. ఆంధ్రభూమి గురువారం పత్రికలో మంచంపట్టిన చీడివలస అనే శీర్షికలతో కథనం వెలువడింది. దీనిపై వైద్య సిబ్బంది స్పందించి గురువారం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. వియ్యంపేట పిహెచ్‌సి వైద్యులు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిబ్బంది రోగులను పరీక్షించారు. చీడివలస గ్రామంలో ప్రతి ఇంటికీ తమ సిబ్బందిని పంపించి పరీక్షలు చేసారు. జ్వరాలతో బాధపుడుతున్న రోగులను పరిశీలించారు. ఈ సీజన్‌లో వైరల్ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు లేవని చెప్పారు. కొంతమంది రోగులు రక్తపరీక్షలకు కొత్తవలస వెళ్తే అందులో మలేరియా పాజిటివ్ అని రిపోర్టు ఇస్తున్నారని చెప్పారు. అలాగే వారికి నచ్చిన మందులు ఇచ్చేస్తున్నారని, వారిపై చర్యలకు వైద్య సిబ్బందిని పంపిస్తామని సుబ్రహ్మణ్యం అన్నారు. జ్వరాలు వచ్చిన వెంటనే రక్త పరీక్షలు వద్దని పిహెచ్‌సి వైద్యులను సంప్రదించాలని కోరారు. రోగులకు మందులు అందించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ ప్రసాద్, ఎ ఎన్ ఎం సత్యవతి పాల్గొన్నారు.