విజయనగరం

పిహెచ్‌సి సిబ్బంది పనితీరు మార్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపాడ, జూన్ 2: స్థానిక పిహెచ్‌సి వైద్యసిబ్బంది తమ పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం. శారద హెచ్చరించారు. గురువారం వేపాడ పిహెచ్‌సిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అపుడే ప్రసవించిన మహిళను, బిడ్డను పరిశీలించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసారు. సక్రమమైన రీతిలో వైద్య సేవలు అందిస్తే ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు. ఇన్ పేషెంట్లు 50శాతం ఉన్నారు. ఐపి ఓపి పెరిగితే పట్టిక కూడా పెరుగుతుందని చెప్పారు. ఓపి నమోదుతోపాటు అప్‌లోడ్ చేయాలని అన్నారు. దీనివలన ఆసుపత్రికి అవసరమైన మందులు హెచ్‌డి ఎఫ్ బడ్జెట్ వస్తుందని తెలిపారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకునేలా చైతన్యపరచాలని అన్నారు. ఎన్టీ ఆర్ వైద్య సేవలకు సంబంధించి టెక్నిషియన్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు