విజయనగరం

జిల్లాలో రూ.531 కోట్ల రుణాలు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, జూన్ 2: ప్రస్తుత ఏడాదిలో 531కోట్ల మేర డ్వాక్రా సభ్యులకు రుణాలు అందించడమే లక్ష్యమని డిఆర్‌డిఎ పిడి ఢిల్లీరావు తెలిపారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది డ్వాక్రా సభ్యులు ఉండగా వీరిలో లక్ష మందికి జీవనోపాధి శిక్షణకు కసరత్తుపూర్తయిందని చెప్పారు. ఇప్పటికే తమ సిబ్బంది గ్రామ స్థాయిలో ఆసక్తి గల సభ్యులను శిక్షణ కోసం గుర్తించారని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రణాళికను సెర్ఫ్‌కు పంపించామని అన్నారు. స్ర్తినిధి, బ్యాంకు లింకేజీ ద్వారా జీవనోపాధిలో భాగంగా మహిళలకు ఆర్థిక పరిపుష్టిత చేస్తామని చెప్పారు. ఉపాధి హామీ ద్వారా సుమారు 500 మంది మహిళా సభ్యులతో కూరగాయల పందిళ్లు వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ సమన్వయంతో సేంద్రియ వ్యవసాయ విధానం పాటించేందుకు తమ శాఖ ప్రణాళిక తయారుచేసిందని అన్నారు. సుమారు 80మంది ఎన్‌పి ఎం సిసిలు ఉన్నారని, జిల్లాలో పది క్లస్టర్లను గుర్తించామని చెప్పారు. బొండపల్లి మండలం కొవ్వాడ పేట, బొబ్బిలి మండలం మెట్టవలస, కురుపాం మండలం మంతినవలస, మెంటాడ మండలం పిట్టాడ, వేపాడ మండలం వీలుపర్తి, గరుగుబిల్లి మండలం నాగూరు, తోటపల్లి, డెంకాడ మండలం చెల్లూరు, పూసపాటిరేగ మండలం గోవిందపురం క్లస్టర్లను గుర్తించామని అన్నారు. ఒక్కొక్క క్లస్టర్‌లో సుమారు రెండు వేల ఎకరాలలో సేంద్రియ పద్ధతులను పాటించి రైతులు వ్యవసాయ సాగుచేస్తామని చెప్పారు. సమావేశంలో వెలుగు ఎపి ఎం కల్యాణి పాల్గొన్నారు.