విజయనగరం

పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 2: జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాడి పరిశ్రమ, పశు సంపద అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే పాల ఉత్పత్తి ఇంకా పెంచవలసిన అవసరం ఉందని చెప్పారు. రైతులకు అవసరమైన రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించి పశువులు కొనుగోలు చేయించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాలులో పశు సంవర్ధక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పశువులకు అవసరమైన దాణాకోసం జిల్లాలో విస్తృతంగా పశుగ్రాసం క్షేత్రాలను ఏర్పాటుచేయాలని చెప్పారు. జిల్లాలో మరిన్ని డెయిరీలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే మంజూరైన హైడ్రోపోనిక్ యూనిట్ల ఏర్పాటును వెంటనే పూర్తిచేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 80 హైడ్రోపోనిక్ యూనిట్లు మంజూరవగా ఇప్పటికి కేవలం 40యూనిట్లను మాత్రమే ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావిస్తూ పశుసంవర్థకశాఖ అధికారుల, సిబ్బంది పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేసారు. క్షేత్ర స్థాయిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌లకు, సిబ్బందికి టార్గెట్లు నిర్ణయించి అధికారులు పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. 1500 ఎకరాలలో పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేయాలని, సీజన్‌కు అవసరమైన పశుగ్రాసాన్ని పది వేల ఎకరాలలో పండించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాల ఉత్పత్తిలో కృషి చేస్తున్న రైతులను గుర్తించి వారితో మిగిలిన పాడిరైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సింహాచలం, జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.