విజయనగరం

ఇబ్బందులున్నా.. అధిగమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 2: రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరగటంతో ప్రభుత్వం, ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల మంత్రి డాక్టర్ మృణాళిని అన్నారు. తెలంగాణకు మేలు కలిగిన కారణంగా అక్కడ సంబరాలు జరుపుకుంటున్నారని, కష్టాల్లో, నష్టాల్లో ఉన్న మనం అభివృద్ధి చెందేంత వరకు నవనిర్మాణ దీక్షలు కొనసాగించాలని సూచించారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి మృణాళిని, జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యే మీసాల గీత, కలెక్టర్ ఎంఎం నాయక్, ఎస్పీ కాళిదాసు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం కోట జంక్షన్ వద్ద జరిగిన నవనిర్మాణ దీక్ష సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధిపై ప్రత్యేక విజన్ ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్ర భవిష్యత్‌కోసం దీర్ఘకాలిక ప్రణాళికతో అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. 2050నాటికి రాష్ట్రాన్ని అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా తీసుకున్నారని చెప్పారు. ఒకపక్క అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తోందని తెలిపారు. కలెక్టర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతు రాష్ట్ర విభజనను మనం కోరుకోలేదని, అసంబద్ధంగా జరిగిన రాష్ట్ర విభజనతో తలెత్తే కష్టనష్టాలను గమనించే ప్రజలు చంద్రబాబునాయుడికి పట్టం కట్టారని, ప్రజల ఆశలకు అనుగుణంగా నీతివంతమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతు జూన్ 2ను జీవితంలో మరచిపోలేని రోజుగా చెప్పారు. విభజన నష్టాలను అధిగమించి అమరావతి కేంద్రంగా అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి కష్టపడుతున్నారని తెలిపారు. సమైక్యాంధ్ర పోరాటంలో పాల్గొన్న యువకులు, విద్యార్థులపై పెట్టిన కేసులను కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు జోక్యంతో లేకుండా చూసామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమావతి, జిల్లా ఎస్పీ కాళిదాసు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు, ఎన్‌జి ఓల ప్రతినిధి ప్రభూజీ తదితరులు ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ నుండి లైవ్ టెలీకాస్ట్ ద్వారా ప్రజాప్రతినిధులతో, అధికారులతో, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.