విజయనగరం

మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగానికి తాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 3: అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల నేపథ్యంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఉద్యోగులలో గుబులు రేగుతోంది. ప్రతినిత్యం రద్దీగా ఉండే విభాగం గదికి శుక్రవారం తాళాలు వేశారు. గురువారం మధ్యాహ్నం అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు చేయడంతో ఆ విభాగానికి చెందిన అధికారులు, ఉద్యోగులు పత్తా లేకుండా పోయారు. దీంతో ఈ విభాగంలో కీలకమైన రికార్డులు ఉండటంతో తగిన భద్రత కోసం గదికి తాళాలు వేసినట్లు తెలిసింది. టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సిహెచ్‌వి నారాయణరావులంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో రికార్డుల పరిశీలన కోసం గురువారం సాయంత్రం ఎసిబి అధికారులు (మున్సిపల్ కార్యాలయానికి వచ్చినప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు బయటకు వెళ్లిపోయారు. దీంతో రికార్డులను పరిశీలించడం ఎసిబి అధికారులకు కష్టసాధ్యమైంది. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లోనే చాలాసేపువేసి ఉండవలసి వచ్చింది. టౌన్ ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో నిరీక్షించవలసి వచ్చింది. అటెండర్ స్థాయి నుంచి టిపిఓ కూడా బయటకు వెళ్లిపోవడంతో ఎసిబి అధికారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎసిబి అధికారులను ఆశ్రయించిన జి.మురళీకి సంబంధించిన ఎండార్స్‌మెంట్ ఫైల్ కోసం నరకయాతన పడ్డారు. కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ఎసిబికి పట్టుబడిన టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ నారాయణరావును కార్యాలయానికి తీసుకువచ్చి సంబంధిత ఫైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎసిబి అధికారుల తనిఖీల నేపథ్యంలో తగిన సమాచారం అందించేందుకు సంబంధిత విభాగం అధికారులు, ఉద్యోగులు కార్యాలయంలో లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు సంజాయిషీ నోటీసులను జారీ చేశారు. విధులలో ఉంటూ ఎందుకు గైర్హాజరు కావలసి వచ్చిందో తగిన సమాధానం చెప్పాలని, లేకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.