విజయనగరం

రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరివిడి, జూన్ 3: ఆంధ్ర ప్రదేశ్‌ను శరవేగంగా అభివృద్ధి చేసి అగ్రగామి రాష్ట్రంగా నిలపడమే నవనిర్మాణ దీక్ష ధ్యేయమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి గృహనిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. ఆర్‌డి ఓ శ్రీనివాసమూర్తి అధ్యక్షతన చీపురుపల్లిలో శుక్రవారం సాయంత్రం నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రజలకు తీరని అన్యాయం చేసినా, ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడును ఎన్నుకున్నారని అన్నారు. కేంద్రం నుంచి అంతంత మాత్రంగానే సహకారం ఉన్నా అకుంఠిత దీక్షతో ముఖ్యమంత్రి చేస్తున్న కృష్టికి ప్రజలు మద్దతుగా నిలవాలని ఆమె కోరారు. రాజధాని నిర్మాణానికి 20వేల కోట్లు అవసరం కాగా 1500 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చాయని, అయిన సుందర రాజధానిగా నిర్మించుకోవడానికి, ఎపి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి అందరి సహకారంతో కృషి జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ వంటి ప్రజల ఆకాంక్షలను సాధించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణ, చీపురుపల్లి ఎంపిపి రౌతు కాంతమ్మ, ఆర్ ఇ సి ఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, జడ్పీటిసి వర్హాలనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు, ఎ ఎంసి చైర్మన్ సీతారామరాజు పాల్గొన్నారు.