విజయనగరం

అంతా ఆర్భాటమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 3: రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా విభజన తరువాత ఏర్పడిన ఇబ్బందులపై జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన చర్చాగోష్ఠులకు ప్రజలనుంచి స్పందన లేకుండా పోయింది. జిల్లాకేంద్రంలో ఆనంద గజపతిరాజు ఆడిటోరియంలో నిర్వహించిన చర్చాగోష్ఠికి ఎమ్మెల్యే మీసాల గీత, కొందరు అధికారులు, కొందరు టిడిపి నాయకులు, అరకొర ప్రజలు మాత్రమే హాజరవగా జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో జరిగిన చర్చా గోష్ఠులలో మొక్కుబడి హాజరు మాత్రమే కనిపించింది. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం మొదటిరోజైన గురువారం ర్యాలీలు, బహిరంగ సభల సందర్భంగా కాస్త హడావుడి కనిపించినా రెండవ రోజుకు కార్యక్రమం చప్పబడినట్లుగా మారింది. ఆనందగజపతిరాజు ఆడిటోరియంలో జరిగిన చర్చాగోష్టికి ఎమ్మెల్యే మీసాలగీత, పట్టణ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్, కొద్ది సంఖ్యలో వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి చిన్న కార్యక్రమానికి వందల సంఖ్యలో జనాలను సేకరించే అధికార పార్టీ నాయకులు నవ నిర్మాణ దీక్షలో భాగంగా జరిగిన చర్చా గోష్టి విషయానికి వచ్చేసరికి జనాలను తరలించే విషయంలో విఫలమయ్యారు. మహిళా సంఘాలు, పెన్షనర్లు అతితక్కువ సంఖ్యలో సామాన్య ప్రజలు కనిపించారు. అదేవిధంగా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన చర్చాగోష్టి ప్రభుత్వ సిబ్బంది, విఆర్‌ఓలకు పరిమితమైంది. బొబ్బిలిలో జరిగిన చర్చాగోష్టి అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ సిబ్బందికే పరిమితమైంది. పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట తదితర ప్రాంతాలలో కూడా చర్చా గోష్టులు మొక్కుబడిగా జరిగినట్లు సమాచారం.