విజయనగరం

సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 7: ఎస్సీ నిరుద్యోగుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. నవ నిర్మాణ వారోత్సవాలలో భాగంగా ఎస్సీ యువకులకు సబ్సిడీ రుణాలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ ఎస్సీల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. దీనిలోభాగంగా స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి కల్పించేందుకు సబ్సిడీ రుణాలను అందిస్తుందని చెప్పారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి పథకం ద్వారా రెండున్నర లక్షల రూపాయల రుణమొత్తంలో ఎస్సీ కార్పోరేషన్ లక్ష రూపాయల సబ్సిడీని అందిస్తుందని అన్నారు. ఇందులో ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి రుణం 1,37,500 రూపాయలు కాగా, లబ్థిదారుని వాటా కింద 12,500 రూపాయలు సమకూర్చుకోవాలని తెలిపారు. పెద్ద మొత్తంలో సబ్సిడీ రుణాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని అన్నారు. చిన్న,మధ్య తరహా వ్యాపారులు, టిడిపి,లేజర్, స్క్రీన్ ప్రింటింగ్ వంటివాటిని కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందిస్తుందని అన్నారు. అందువల్ల ప్రభుత్వం కల్పించే సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, జెడ్పీ సిఇఒ జి.రాజకుమారి పాల్గొన్నారు.